ఇంట్లో బరువైన వస్తువుల్ని తరలించడం మహిళలకు కాస్త కష్టమైన పనే! ఈ క్రమంలో దెబ్బలు తగలడం,కండరాలు పట్టేయడం లాంటివీ ఇబ్బంది పెడుతుంటాయి. సరిగ్గా తరలించకుంటే.. కొన్ని వస్తువులు పాడయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అలా కాకుండా ఉండేందుకు.. సరికొత్త ‘వీల్స్’ అందుబాటులోకి వచ్చాయి.
JICOOT Appliance Wheelsగా పిలిచే ఈ కిచెన్ గ్యాడ్జెట్స్.. బరువైన వస్తువులను సులభంగా తరలిస్తాయి. గ్యాస్ సిలిండర్, కాఫీ మేకర్, కూలర్.. ఇలా అవసరం మేరకు జరుపుతూ వాడే వస్తువులకు వీటిని అతికిస్తే సరి. దీనికి ఉండే మూడు మినీ కోస్టర్ వీల్స్‌తో.. వస్తువుల్ని ఎటైనా తిప్పొచ్చు. వీల్స్ కూడా అంతే అనువుగా.. 360 డిగ్రీల కోణంలో ఎటైనా తిరుగుతాయి. హాల్లో నిత్యం అటూఇటూ తిప్పే టీపాయ్, చెక్క పీటలకూ వీటిని అమర్చుకోవచ్చు. వీటి వాడకంతో గదుల్లోని గచ్చుకూడా పాడవకుండా ఉంటుంది. వీటి ధర సుమారు రూ.699. ఆన్లైన్ మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయివి.