తిన్న తర్వాత నడకతో..
తిన్న తర్వాత పదిహేను నిమిషాలు నడిచే చిన్న అలవాటు ద్వారా ఆరోగ్యపరమైన ప్రయోజనాలెన్నో పొందొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత పదిహేను నిమిషాలు నడిచేవాళ్లకు ఆరోగ్యపరంగా అయిదు రకాల ప్రయోజనాలున్నాయట.
తిన్న తర్వాత పదిహేను నిమిషాలు నడిచే చిన్న అలవాటు ద్వారా ఆరోగ్యపరమైన ప్రయోజనాలెన్నో పొందొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత పదిహేను నిమిషాలు నడిచేవాళ్లకు ఆరోగ్యపరంగా అయిదు రకాల ప్రయోజనాలున్నాయట.
తిన్న తర్వాత పదిహేను నిమిషాల పాటు నడిచినప్పుడు రక్తంలో గ్లూకోజ్ ఖర్చు అవుతుంది. కాబట్టి రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గుతుంది. వృద్ధుల రక్తంలో అధిక చక్కెర స్థాయికి, నడకకు ఉన్న సంబంధం గురించి అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ జరిపిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలను పరిశీలించారు.
భోజనం చేసిన అరగంట తర్వాత పదిహేను నిమిషాలు నడిచినవాళ్ల ఆరోగ్యం వాకింగ్ చేయని వారితో పోలిస్తే మెరుగ్గా ఉన్నట్టు గుర్తించారు. అలాగే నలభై అయిదు నిమిషాల పాటు నడిచేవాళ్లలో ైగ్లెసెమిక్ నియంత్రణ సరిగ్గా ఉన్నట్టు తేల్చారు.
తిన్న తర్వాత పదిహేను నిమిషాల నడక (గంటకు నాలుగు కిలోమీటర్ల వేగంతో) వల్ల జీర్ణక్రియ త్వరగా జరుగుతుంది. తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారం తీసుకున్న తర్వాత పదిహేను నిమిషాలు నడిస్తే రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగవుతుంది.
భోజనం తర్వాత వ్యాయామానికి, భోజనానికి ముందు వ్యాయామానికి మధ్య ఉండే తేడాలను గుర్తించేందుకు జరిగిన అధ్యయనంలో తిన్న తర్వాత నడిచేవారి శరీరంలో కొవ్వు నిల్వలు తక్కువగా ఉంటాయని గుర్తించారు.
భోజనానంతర నడక వల్ల కార్టిసోల్ హార్మోన్ నియంత్రణలో ఉంటుంది. ఇది మెలటోనిన్ విడుదలను ప్రభావితం చేస్తుంది. అందువల్ల సుఖవంతమైన నిద్ర పడుతుంది. ఇది మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు దోహదపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

