MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
MBA student dies | సెమిస్టర్ పరీక్షకు ముందు ఎంబీఏ విద్యార్థిని పరీక్షా హాల్ నుంచి బయటకు వచ్చింది. ఆ బిల్డింగ్ ఆరో అంతస్తుకు ఆమె చేరుకున్నది. అక్కడి నుంచి కిందకు దూకి మరణించింది. ఆ విద్యార్థిని మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జైపూర్: సెమిస్టర్ పరీక్షకు ముందు ఎంబీఏ విద్యార్థిని పరీక్షా హాల్ నుంచి బయటకు వచ్చింది. ఆ బిల్డింగ్ ఆరో అంతస్తుకు ఆమె చేరుకున్నది. అక్కడి నుంచి కిందకు దూకి మరణించింది. ఆ విద్యార్థిని మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఈ సంఘటన జరిగింది. (MBA student dies) శనివారం ఉదయం ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో మిడ్ సెమిస్టర్ ఎగ్జామ్ జరుగనున్నది. 23 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని పరీక్షా హాలులోకి ప్రవేశించే ముందు తన స్నేహితులతో మాట్లాడింది.
కాగా, ఆ విద్యార్థినికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ తర్వాత ఆమె యూనివర్సిటీ బిల్డింగ్‌లోని ఆరవ అంతస్తుకు వెళ్లింది. ఆ భవనం అంచున ఆ యువతి కూర్చొని ఉండటాన్ని కొందరు విద్యార్థులు గమనించారు. ఆమెను నిలువరించేందుకు కొందరు అక్కడకు పరుగెత్తారు. అయితే వారు అక్కడకు చేరుకునే లోపు ఆమె అక్కడ నుంచి కిందకు దూకింది. తీవ్రంగా గాయపడిన ఆ యువతిని వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆమె మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
మరోవైపు మరణించిన యువతి ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్న యశస్వి రోహిల్లాగా గుర్తించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. విద్యార్థిని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. ఆ విద్యార్థిని ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది అన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో సెమిస్టర్ పరీక్షను ఆ యూనివర్సిటీ వాయిదా వేసింది.
जयपुर में पूर्णिमा यूनिवर्सिटी में छठी मंजिल से छात्रा ने लगाई छलांग
हादसे में छात्रा की मौके पर ही मौत https://t.co/5nWlfCEeLq
— Bhawani Singh (@BhawaniSinghjpr) October 31, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
Jajula Srinivas Goud | బీసీ కులగణనపై అమిత్ షా స్పందించాలి.. దేశవ్యాప్త ఉద్యమం ఆపేది లేదు: జాజుల
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

