గేమింగ్ అంటే చాలా మందికి ఇష్టం. కానీ సాధారణ ఫోన్లలో ఎక్కువ సేపు ఆడితే ఫోన్ వేడెక్కుతుంది, స్లో అవుతుంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ తీసుకొచ్చింది. అదే ఇన్ఫినిక్స్ GT 30 5G+. ఇది ఫోన్ మాత్రమే కాదు, గేమర్స్ కోసం తయారు చేసిన ఒక పవర్ ప్యాక్డ్ మెషిన్. ైస్టెలిష్ లుక్తో వచ్చిన ఈ స్మార్ట్ఫోన్ వెనుక వైపు సైబర్ మెకా డిజైన్తో పాటు తెల్లని లైట్లు కూడా ఉన్నాయి.
ఈ ఫోన్కు పక్కన రెండు చిన్న బటన్స్ ఇచ్చారు. వీటితో సులభంగా గేమ్స్ ఆడేయొచ్చు. MediaTek Dimensity 7400 చిప్సెట్ ఉండటంతో ఫోన్ మెరుపువేగంతో పనిచేస్తుంది. గేమ్ ఎంతసేపు ఆడినా ఫోన్ వేడెక్కకుండా ప్రత్యేకమైన కూలింగ్ సిస్టమ్ కూడా ఇందులో ఉంది. 6.78 అంగుళాల స్క్రీన్, 1.5K AMOLED డిస్ప్లే కలిగి ఉంది.
ఇక బ్యాటరీ సామర్థ్యం 5,500 mAh. అలాగే, 45 W ఫాస్ట్ చార్జర్ ఉండటంతో ఫోన్ చాలా త్వరగా చార్జ్ అవుతుంది. వెనుక 64 MP కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 15పైన వెర్షన్తో పనిచేస్తుంది. రెండు OS అప్డేట్స్తో పాటు మూడేళ్ల సెక్యూరిటీ ప్యాచెస్ వస్తాయి. ఈ ఫోన్ ఫ్రారంభ ధర రూ.19,499. మూడు రంగుల్లో అందుబాటులో ఉంది.