‘ఆపరేషన్ సిందూర్’తో భారత్ – పాకిస్థాన్ మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పరిస్థితులు చేయిదాటితే.. పూర్తిస్థాయి యుద్ధంవైపు మళ్లే అవకాశాలూ ఉన్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పౌరులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ సందర్భంగా ప్రజలు ఎలా వ్యవహరించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తమతోపాటు తమ కుటుంబాన్ని, సమాజాన్నీ రక్షించుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? యుద్ధ సమయంలో ఏం చేయాలో, ఎలాంటి స్పృహతో ఉండాలో అధికారులు కొన్ని సలహాలు, సూచనలు అందిస్తున్నారు.