ఊహ తెలిసింది మొదలు.. మెదడులో అన్నీ స్టోర్ అవుతుంటాయి. ఫలాన రోజు అలా జరిగింది.. ఆ రోజు మేం అక్కడికి వెళ్లాం.. అది చేశాం.. ఇది తిన్నాం.. అని చెబుతుంటాం. అయితే, అన్ని మెమొరీస్కి కచ్చితంగా ఓ ట్యాగ్ ఉంటుంది. అదే తేది. సందర్భాలు, సంఘటనలు.. ఇలా ఏదైనా తేదీలతోనే గుర్తు పెట్టుకుంటాం. తిరిగి సెలెబ్రేట్ చేసుకుంటాం. ఎంత గుర్తుకున్నా కాలక్రమంలో కొన్ని ఈవెంట్స్‌ని మర్చిపోతుంటాం. అవి పుట్టినరోజులు అయ్యిండొచ్చు… పెళ్లి రోజులు కావచ్చు.. అలా జరగకుండా ఉండాలంటే? ఈవెంట్ ఏదైనా మిస్ కాకుండా అటెండ్ అవ్వాలంటే? సింపుల్‌గా గూగుల్ క్యాలెండర్ సాయం తీసుకోవచ్చు. సంప్రదాయ పద్ధతిలోనే కాకుండా.. చాలా సింపుల్ టెక్నిక్‌తో ముఖ్యమైన తేదీల్ని ఆయా కాంటాక్ట్‌లకు జత చేయొచ్చు. ఉదాహరణకు.. మీ ఫోన్లోని ఓ వ్యక్తి పుట్టిన రోజుని గుర్తుంచుకోవాలి అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారంటే.. ఫోన్లోని గూగుల్ కాంటాక్ట్స్‌లోకి వెళ్లాలి. అతని ఫోన్ నెంబర్ని ట్యాప్ చేయాలి. తిరిగి తెర పైభాగంలో కనిపించే ‘పెన్సిల్ ఐకాన్’ని తాకాలి.
దీంతో ఎడిట్ కాంటాక్ట్ ఓపెన్ అవుతుంది. అక్కడ కనిపించే ఆప్షన్స్‌లోని ‘యాడ్ సిగ్నిఫికెంట్ డేట్’ని ట్యాప్ చేయాలి. దీంతో వారికి సంబంధించిన ముఖ్యమైన తేదీలను మార్క్ చేయవచ్చు. ‘నోట్స్’లో ఆ తేదీ గురించి రాయొచ్చు. ఉదాహరణకు పుట్టిన రోజు అయితే.. ఎలా ప్లాన్ చేయాలో డిస్క్రిప్షన్ రాసుకుని ‘సేవ్’ చేయాలి. అంతేకాదు.. ఆయా ముఖ్యమైన తేదీలను నోటిఫికేషన్స్ రూపంలో మీకు ఒకటిరెండ్రోజులకు ముందే వచ్చేలా చేయొచ్చు. అందుకు యాడ్ చేసి సిగ్నిఫికెంట్ డేట్ పక్కనే కనిపించే ‘బెల్’ ఐకాన్ని సెలెక్ట్ చేయాలి. ఏ రోజు.. ఏ టైమ్‌కి మీకు నోటిఫికేషన్ రావాలో సెట్ చేసుకునే వీలుంది. ఈ ప్రాసెస్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో ఒకేలా ఉంటుంది. ఒకవేళ మీరు దీన్ని డెస్క్‌టాప్ మీద చేద్దాం అనుకుంటే.. గూగుల్ కాంటాక్ట్స్ వెబ్సైట్ ఓపెన్ చేసి తేదీలను యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎప్పుడైనా ఈవెంట్స్‌ని తొలగించాలనుకుంటే… గూగుల్ కాంటాక్ట్స్‌లోకి వెళ్తే ‘రిమూవ్’ ఆప్షన్ కనిపిస్తుంది. ట్యాప్ చేస్తే సరి! అంతేకాదు.. ‘హైడ్’ కూడా చేసుకోవచ్చు.