ఉప్పు: పెద్దవాళ్ల కోసం కాస్త తక్కువ ఉప్పు వేసి ఆ కూర తీసి పక్కన పెట్టాలి. అందులో నిమ్మకాయ పిండితే కాస్త రుచి వస్తుంది. నిమ్మలో ఉండే విటమిన్ సి ఐరన్ శోషణకి కూడా సహకరిస్తుంది. ఇటీవల ఉప్పుల్లో ఏవేవో వాడుతున్నారు. కానీ అయొడైజ్డ్ సాల్ట్ అన్నది ప్రధానం. థైరాయిడ్ పనితీరుతో పాటు అనేక శరీర చర్యలకు అయొడిన్ అవసరం.
పంచదార: షుగర్ ఉన్న వాళ్లకే కాదు, చిన్న పిల్లలకి కూడా పంచదార తక్కువ వాడాలి. జ్యూసులు చక్కెర లేకుండానే తాగడం అలవాటు చేసుకోవాలి. కొన్ని సందర్భాలకు బెల్లం, కండ చక్కెర కాస్త ఫర్వాలేదు.
– లక్ష్మీహరిత ఇంద్రగంటి