లిప్స్టిక్ ఎంపిక ఇలా..
ఆడవాళ్ల అందంలో లిప్స్టిక్ కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ సౌందర్యాన్ని పెంచడంలో ఇది ముందువరుసలో ఉంటుంది. అయితే, కొందరు తమ స్కిన్టోన్కు సరిపోయే లిప్స్టిక్ని ఎంచుకోవడంలో తడబడుతుంటారు.
ఆడవాళ్ల అందంలో లిప్స్టిక్ కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ సౌందర్యాన్ని పెంచడంలో ఇది ముందువరుసలో ఉంటుంది. అయితే, కొందరు తమ స్కిన్టోన్కు సరిపోయే లిప్స్టిక్ని ఎంచుకోవడంలో తడబడుతుంటారు. అలాంటివారి కోసం సౌందర్య నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు.
తెల్లని మేనిఛాయ ఉన్నవారికి లేత రంగు లిప్స్టిక్స్ బాగా సూట్ అవుతాయట. ఇలాంటివారు సాఫ్ట్ పింక్, పీచ్ కలర్, రోజ్ కలర్ లాంటి షేడ్స్ ఎంచుకోవాలి. అప్పుడు వారి ముఖం మరింత కాంతిమంతంగా కనిపిస్తుందని చెబుతున్నారు.
ఇక చామన ఛాయ రంగులో ఉన్నట్లయితే.. బెర్రీ, మోవ్, డీప్ పింక్ వంటి రంగులను వాడుకోవచ్చని అంటున్నారు. ఈ షేడ్స్.. వారి పెదవులను సహజంగా చూపిస్తూ, గ్లామర్ లుక్ కూడా ఇస్తాయని సలహా ఇస్తున్నారు.
నలుపు రంగులో ఉండేవారికి డీప్ ప్లమ్, చాకొలేట్, బ్రౌన్ కలర్ లిప్స్టిక్స్ మంచి ఎంపిక అని చెబుతున్నారు. ఈ డార్క్ షేడ్స్.. వారి చర్మ ఛాయతో కలిసిపోతాయనీ, రిచ్ లుక్ ఇస్తాయనీ అంటున్నారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

