e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Home జిందగీ అరచేతిలో హాస్పిటల్‌

అరచేతిలో హాస్పిటల్‌

అరచేతిలో హాస్పిటల్‌

కరోనా రోజురోజుకూ విజృంభిస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. ఎప్పుడు ఏ వార్త వినాల్సివస్తుందోనని భయపడుతున్నారు చాలామంది. ఆక్సిజన్‌, బెడ్లు, రక్తం, ప్లాస్మా అందుబాటులో లేక నానా అవస్థలు పడుతున్నారు కొవిడ్‌ బాధితులు. తన తల్లి విషయంలో ఈ బాధను అనుభవించి, హాస్పిటల్స్‌లోని పడకల వివరాలు తెలిపేలా ఓ యాప్‌ని క్రియేట్‌ చేసింది హైదరాబాద్‌కు చెందిన వెన్సీ కృష్ణ. కొన్నిరోజుల క్రితం వెన్సీ తల్లికి కరోనా అని నిర్ధారణ అయింది. ఆ సమయంలో హాస్పిటల్‌ బెడ్‌ దొరక్క ఇబ్బంది పడింది. చివరకు ఎలాగోలా ఆమె తల్లి కొవిడ్‌ను జయించగలిగింది. ఈ అనుభవంతో హైదరాబాద్‌లోని ఏ హాస్పిటల్‌లో, ఎన్ని బెడ్లు అందుబాటులో ఉన్నాయనే విషయం అందరికీ తెలియచేయాలి అనుకుంది. అందుకు ఓ యాప్‌ క్రియేట్‌ చేసింది. అనుకున్న రెండు గంటల్లో ఈ యాప్‌ని రూపొందించింది. hydcovidresources పేరుతో ప్రారంభించిన ఈ యాప్‌ని కేవలం ఐదు రోజుల్లోనే రెండు లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

Advertisement
అరచేతిలో హాస్పిటల్‌
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement