ఉదయం లేవగానే..
ఉదయం టీ, కాఫీ తాగడం.. సమయం లేదని బ్రేక్ ఫాస్ట్ తినకుండానే ఆఫీసుకి వెళ్లడం.. వంటివి చేస్తుంటారు కొందరు. అయితే వీటివల్ల వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
ఉదయం టీ, కాఫీ తాగడం.. సమయం లేదని బ్రేక్ ఫాస్ట్ తినకుండానే ఆఫీసుకి వెళ్లడం.. వంటివి చేస్తుంటారు కొందరు. అయితే వీటివల్ల వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి ఉదయం లేవగానే చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లేంటో తెలుసుకుని, వాటిని సరిదిద్దుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉండచ్చు.
కుడిపక్కకు తిరిగి..
కొంతమంది ఉదయం నిద్ర లేచేటప్పుడు వెల్లకిలా పడుకొని అదే పొజిషన్లో గబుక్కున లేచి కూర్చుంటారు. కానీ, అలా లేవడం వల్ల బిగుసుకుపోయిన కండరాల్లో నొప్పి వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. కాబట్టి ఉదయం లేచేటప్పుడు కుడిపక్కకు తిరిగి నెమ్మదిగా లేవడం మంచిది. ఆపై కాస్త అటూ ఇటూ కదలడం వల్ల రాత్రంతా నిశ్చలంగా ఉన్న శరీర భాగాలకు రక్తప్రసరణ మెరుగవుతుందట. ఇదే రోజంతా మనల్ని ఉత్సాహంగా ఉంచుతుందట.
బ్రేక్ ఫాస్ట్ మానద్దు!
ఆఫీసు టైమవుతోందని బ్రేక్ఫాస్ట్ తినడం కూడా మానేస్తుంటారు కొందరు. ఈ అలవాటు దీర్ఘకాలంలో రోగనిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు.. స్థూలకాయం, మధుమేహం.. వంటి సమస్యలు తెచ్చి పెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి బ్రేక్ ఫాస్ట్ అస్సలు మిస్ చేయొద్దు.
వార్మప్ షురూ!
ఉదయాన్నే చేసే వ్యాయామం రోజంతటికీ కావాల్సిన శక్తిని, ఉత్సాహాన్ని అందిస్తుంది. ఉదయం లేవగానే కొంతమంది అధిక బరువులెత్తడం, ఇతర కఠినమైన వ్యాయామాలు చేస్తుంటారు. ఇవి కండరాల ఆరోగ్యానికి అంత మంచివి కావు. ఒకేసారి ఎక్కువ బరువులెత్తడం, కఠినమైన వ్యాయామాలు చేయడం కాకుండా.. నెమ్మదిగా కదిలించే ప్రయత్నం చేయాలి. వాకింగ్, జాగింగ్ తర్వాత జిమ్ వర్కవుట్లు చేయాలి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

