కాలమేదైనా.. చిన్నారుల స్నానం పూర్తయ్యిందంటే, వారి ఒంటినిండా పౌడర్ రాయాల్సిందే! దీనివల్ల చెమట పట్టకుండా ఉండి, పిల్లలు ఎక్కువపేపు ఫ్రెష్‌గా ఉంటారనేది తల్లిదండ్రుల భావన! చెడువాసన దూరమై.. పిల్లల నుంచి సువాసన వస్తుందని కూడా చాలామంది నమ్మిక! అయితే, సరైన జాగ్రత్తలు పాటించకుంటే.. ‘పౌడర్’ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
పిల్లలకు పౌడర్ వేసేటప్పుడు అది గాలిలో కలిసిపోయి.. వారి ముక్కు, నోటి ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరే ప్రమాదం ఉంటుందట. దీనివల్ల పిల్లల్లో శ్వాస సంబంధ సమస్యలతోపాటు క్యాన్సర్వంటి ప్రమాదకరమైన వ్యాధులనూ కలిగిస్తాయట. చాలా కంపెనీల బేబీ పౌడర్లలో ‘డైలాగ్’ అనే ఖనిజ సమ్మేళనం ఉంటుందనీ, ఇందులోని ఆస్బెస్టాస్ అనే పదార్థం.. క్యాన్సర్‌ను కలగజేస్తుందని హెచ్చరిస్తున్నారు. అందుకే, పిల్లలకు పౌడర్ రాసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.