కలిపి తింటే.. కలదు ఆరోగ్యం!
‘ఆహారం’ అనేది కడుపు నింపడమే కాదు.. ఆరోగ్యానికీ భరోసా అందిస్తుంది. ఒక్కో కూరగాయ, ఆకు కూరతో.. శరీరానికి ఒక్కోరకమైన ప్రయోజనం కలుగుతుంది. అయితే, కొందరిలో కొన్ని కూరగాయలు అలర్జీని కలగజేస్తాయి. వంటలో లోపాల వల్ల.. కొన్ని ప్రయోజనాలు అందకుండా పోతాయి. అలా కాకుండా ఉండాలంటే.. ఈ కింది చిట్కాలు పాటిస్తే సరి!
‘ఆహారం’ అనేది కడుపు నింపడమే కాదు.. ఆరోగ్యానికీ భరోసా అందిస్తుంది. ఒక్కో కూరగాయ, ఆకు కూరతో.. శరీరానికి ఒక్కోరకమైన ప్రయోజనం కలుగుతుంది. అయితే, కొందరిలో కొన్ని కూరగాయలు అలర్జీని కలగజేస్తాయి. వంటలో లోపాల వల్ల.. కొన్ని ప్రయోజనాలు అందకుండా పోతాయి. అలా కాకుండా ఉండాలంటే.. ఈ కింది చిట్కాలు పాటిస్తే సరి!
- కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ, చేదుగా ఉంటుందని తినడానికి ఆసక్తి చూపించరు. అదే..
కాకరకాయ కూరకు కొద్దిగా కొబ్బరి తురుము, నువ్వుల పొడి జోడించి చూడండి. చేదు ఎగిరిపోయి.. మరింత రుచికరంగా తయారవుతుంది. - కూరగాయల్లో రారాజుగా వంకాయను కీర్తిస్తారు. అయితే, కొన్నిరకాల వంకాయలు.. అలెర్జీలను కలిగిస్తాయి. అలాంటివి తింటే.. గొంతులో దురద, చర్మంపై దద్దుర్లు లాంటి సమస్యలు వస్తాయి. అందుకే.. వంకాయను వండేటప్పుడు కూరలో కొన్ని మెంతి గింజలను వేస్తే సరి. దీనివల్ల మంట తగ్గుతుంది.
రక్తం కూడా శుద్ధి అవుతుంది. - పాలకూర నుంచి ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. కానీ, ఆహారంలో సహజంగా ఉండే ఆక్సలేట్ కారణంగా.. ఆ
ఐరన్ను శరీరం పూర్తిగా శోషించుకోలేదు. పాలకూరకు కొద్దిగా నిమ్మకాయ, నల్లమిరియాలు కలిపితే.. ఐరన్ శోషణ మెరుగు పడుతుంది. - ఆలుగడ్డలను చాలామంది ఇష్టంగా తింటారు. కానీ, అందులో అధికంగా లభించే పిండి పదార్థం.. కొంతమందిలో మలబద్ధకం సమస్యను కలిగించవచ్చు. అలా కావొద్దంటే.. ఆలుగడ్డలను ఉడికించేటప్పుడు కొంచెం ఆవాలు కలపండి. అవి పిండి పదార్థాన్ని విచ్ఛిన్నం చేసి.. మలబద్ధకం రాకుండా చేస్తాయి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

