చలికాలంలో ముఖం పాలిపోయినట్లు తయారవుతుంది. మొటిమలు, నల్ల మచ్చలతో ఇబ్బంది కలుగుతుంది. నిర్లక్ష్యం చేస్తే.. సమస్య మరింత ముదురుతుంది. చిన్నచిన్న చిట్కాలు పాటిస్తూ.. ఇంట్లో దొరికే పదార్థాలతోనే ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఎలాంటి రసాయనాల దుష్ప్రభావం లేకుండా.. ముఖారవిందాన్ని పెంచుకోవచ్చు.
రాత్రిపూట ముఖానికి టోనర్ అప్లయి చేస్తే.. చర్మం ఆరోగ్యంగా, తాజాగా ఉంటుంది. ఇంట్లో ఉండే ‘గ్రీన్ టీ’తోనే.. సహజసిద్ధమైన టోనర్‌ను తయారు చేసుకోవచ్చు. గ్రీన్ టీ పొడిలో రోజ్ వాటర్ కలిపి, ఒక స్ప్రే బాటిల్లో పెట్టుకోవాలి. ఈ టోనర్‌ను రాత్రి పడుకునే ముందు ముఖంపై స్ప్రే చేసుకొని, ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తుంటే.. మంచి ఫలితం కనిపిస్తుంది.
చర్మ సంరక్షణలో పుదీనా అద్భుతంగా పనిచేస్తుంది. నుదుటిపై ఏర్పడే మొటిమలను సమర్థంగా తొలగిస్తుంది. 10-15 పుదీనా ఆకులను మెత్తగా రుబ్బుకొని.. కొద్దిగా రోజ్ వాటర్ కలపాలి. ఈ పేస్ట్‌ను మొటిమల మీద రాసి.. కొన్ని నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత నీటితో కడిగేస్తే సరిపోతుంది.