బడ్జెట్ కస్టమర్ల కోసం గూగుల్ నయా ఫోన్ తెస్తున్నది. మిడ్‌రేంజ్ సెగ్మెంట్ ఫోన్‌గా రూపుదిద్దుకున్న Pixel 9a మార్చిలో విడుదల కానుంది. అయితే, ధర ఎంత? ఫీచర్లు ఏమిటి? అనే ప్రశ్నలపై ఇప్పటికైతే స్పష్టత లేదు. మిడిల్ క్లాస్ వినియోగదారులందరికీ గూగుల్ పిక్సెల్ అంటే ప్రీమియం ఫోనే! గతంలో Pixel 8a ధర ఎక్కువగా ఉండటంతో మిడిల్ క్లాస్ జనాలు నిరాశపడ్డారు.
ఇప్పుడు వారినే టార్గెట్ చేస్తామని ఆ కంపెనీ ప్రతినిధుల మాట! యాపిల్ iPhone 16E ఫోన్‌ను రూ.60,000 ధరకు లాంచ్ చేయడంతో పోటీ పెరిగింది. గూగుల్ కూడా ధరను తగ్గించి వినియోగదారులను ఆకర్షించాలని భావిస్తున్నది. Pixel 9a ఫోన్ ధర అందుబాటులో ఉంచితే.. బడ్జెట్ ఫోన్ లవర్స్‌కు మంచి బహుమతే అవుతుంది. అదే సమయంలో ఇతర సంస్థలకు గట్టి పోటీ ఇచ్చినట్టు అవుతుంది.