వెల్లుల్లి మాత్రమే కాదు.. దాని పొట్టు కూడా పుట్టెడు మేలు చేస్తుంది. ఇది యాంటి బ్యాక్టీరియల్, యాంటి ఫంగల్, యాంటి వైరల్‌గా పని చేస్తుంది. దీన్ని వివిధ రూపాల్లో తీసుకోవడం ద్వారా.. ఆరోగ్యానికి ఎన్నోరకాలుగా ప్రయోజనాలు కలుగుతాయి.

వెల్లుల్లి పొట్టు.. దురద, తామర వంటి చర్మ సమస్యలను నివారిస్తుంది. ఒక గ్లాసు నీటిలో కొద్దిగా వెల్లుల్లి పొట్టు వేసి.. కొన్ని గంటలపాటు నానబెట్టాలి. ఆ నీటితో చర్మ సమస్య ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేసుకుంటే.. దురద, తామర తగ్గుముఖం పడుతుంది.
వెల్లుల్లి పొట్టు ఉబ్బసం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వెల్లుల్లి పొట్టును మెత్తగా రుబ్బి, కొద్దిగా తేనె జోడించాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం ఓ చెంచాడు తీసుకుంటే.. మంచి ఫలితం కనిపిస్తుంది.
జుట్టు సమస్యలకూ వెల్లుల్లి పొట్టు మంచి పరిష్కారం చూపుతుంది. ఇది యాంటి ఫంగల్‌గా పని చేస్తుంది. చుండ్రు, దురదను తగ్గిస్తుంది. వెల్లుల్లి తొక్కలను నీటిలో మరిగించి చల్లార్చాలి. ఆ నీటిని జుట్టుకు బాగా పట్టించి.. తలస్నానం చేస్తే సరిపోతుంది. వెల్లుల్లి పొట్టును మెత్తని పేస్ట్‌లా చేసి.. కుదుళ్లకు బాగా పట్టించాలి. తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.
పాదాల వాపు, నొప్పిని తగ్గించడంలో వెల్లుల్లి పొట్టు సమర్థంగా పనిచేస్తుంది. గుప్పెడు వెల్లుల్లి తొక్కలను నీటిలో బాగా మరిగించి పక్కన పెట్టాలి. నీళ్లు గోరువెచ్చగా అయిన తర్వాత, పాదాలను ఓ 10-15 నిమిషాలపాటు అందులో ఉంచితే.. పాదాల వాపులు తగ్గుతాయి.