Day sleeping Furniture | కునుకు ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు శాస్త్రవేత్తలు. అందులోనూ మధ్యాహ్న భోజనం తర్వాత తీసే ఓ చిన్నపాటి కునుకు… మళ్లీ ఏ అర్ధరాత్రో నిద్రకు ఉపక్రమించే వరకూ ఉత్సాహంగా ఉంచుతుంది. కాబట్టే, కునుకు అవసరాలకు సరిపోయేలా.. ‘డే స్లీపింగ్ ఫర్నిచర్’ మార్కెట్లో లభిస్తున్నది. బాల్కనీలోనో, లాన్లోనో వీటిని ఏర్పాటు చేసుకుంటే స్వచ్ఛమైన గాలి తగులుతుంది. ఏదో ఓ అలికిడి ఉంటుంది కాబట్టి, త్వరగా మేల్కొంటాం. అదే బెడ్రూమ్లో అయితే.. కునుకు కాస్తా గాఢనిద్రగా మారే ప్రమాదం ఉంది. గృహాలంకరణలోనూ ‘డే స్లీపింగ్ ఫర్నిచర్’ను భాగం చేసుకోవచ్చు.