నిష్పత్తి కుదిరితేనే.. ముద్దముద్దలో ఘాటు
భారతీయుల వంటగదిలో అల్లం-వెల్లుల్లి పేస్ట్ కచ్చితంగా ఉండాల్సిందే! శాకాహారమైనా, మాంసాహారమైనా.. ఓ టేబుల్ స్పూన్ అల్లం, వెల్లుల్లి ముద్ద పడాల్సిందే! అయితే, ప్రస్తుత కల్తీల కాలంలో.. అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను ఇంట్లో తయారు చేసుకోవడమే మంచిది! అయితే, దీన్ని నిల్వ ఉంచితే కొద్ది రోజులకే రుచి మారిపోతుంది.
భారతీయుల వంటగదిలో అల్లం-వెల్లుల్లి పేస్ట్ కచ్చితంగా ఉండాల్సిందే! శాకాహారమైనా, మాంసాహారమైనా.. ఓ టేబుల్ స్పూన్ అల్లం, వెల్లుల్లి ముద్ద పడాల్సిందే! అయితే, ప్రస్తుత కల్తీల కాలంలో.. అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను ఇంట్లో తయారు చేసుకోవడమే మంచిది! అయితే, దీన్ని నిల్వ ఉంచితే కొద్ది రోజులకే రుచి మారిపోతుంది. అలాకాకుండా.. అల్లం-వెల్లుల్లి ముద్ద ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి.
- అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీలో రెండిటినీ సరైన నిష్పత్తిలో తీసుకోవడం ముఖ్యం. 60 శాతం వెల్లుల్లి ఉంటే.. 40 శాతం అల్లం ఉండేలా చూసుకోవాలి. రెండింటి పొట్టును పూర్తిగా తీయాలి. లేకుంటే, దానిపై ఉండే తొక్క వల్ల పేస్ట్ రుచి మారుతుంది. త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది.
- నిల్వ ఉంచేవి ఏవైనా.. తేమ తగిలితే పాడవుతాయి. అల్లం-వెల్లుల్లి పేస్ట్ కూడా అంతే! అందుకే, అల్లం ముక్కలను శుభ్రంగా కడిగిన తర్వాత.. తేమ లేకుండా పొడి వస్త్రంతో తుడవాలి. ఆ తర్వాతే మిక్సీ పట్టుకోవాలి. దీనివల్ల పేస్ట్ ఎక్కువకాలం తాజాగా ఉంటుంది.
- ఈ పేస్ట్‌కు ఒకటిన్నర టేబుల్ స్పూన్ పల్లి నూనె గానీ, పొద్దుతిరుగుడు నూనె గానీ, ఒక టీ స్పూన్ ఆలివ్ నూనె గానీ, కొద్దిగా ఉప్పు కలుపుకోవాలి. దీనిని గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. నూనెలు, ఉప్పు సహజసిద్ధమైన ప్రిజర్వేటివ్‌లా పనిచేస్తాయి. పేస్ట్ ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేస్తాయి.
- అప్పుడప్పుడూ అల్లం-వెల్లుల్లి పేస్ట్ ఆకుపచ్చ లేదా పసుపు రంగులోకి మారుతుంటుంది. ఇలా రంగు మారడం పేస్ట్ పాడవుతున్నది అనడానికి ఓ సంకేతం! మిశ్రమంలో టీస్పూన్ నిమ్మరసం వేసి కలిపి, గాలి చొరబడని డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే.. తాజాగా ఉంటుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

