Health tips | గర్భిణులే కాదు.. వారుకూడా ఫోలిక్ యాసిడ్ లోపం లేకుండా చూసుకోవాలి!
Health tips | గర్భిణులకు ఫోలిక్ యాసిడ్ చాలా ముఖ్యమని చెబుతారు. దీన్ని మాత్రల రూపంలో కాకుండా ఆహారం ద్వారా తీసుకోవచ్చా? ఫోలిక్ యాసిడ్ గర్భిణులకే కాకుండా ఎవరెవరికి అవసరం? తెలుపగలరు.
Health tips | గర్భిణులకు ఫోలిక్ యాసిడ్ చాలా ముఖ్యమని చెబుతారు. దీన్ని మాత్రల రూపంలో కాకుండా ఆహారం ద్వారా తీసుకోవచ్చా? ఫోలిక్ యాసిడ్ గర్భిణులకే కాకుండా ఎవరెవరికి అవసరం? తెలుపగలరు.
– ఓ పాఠకురాలు
ఫోలిక్ యాసిడ్‌ను విటమిన్-బి9 అని కూడా అంటారు. ప్రతి మనిషికీ ఇది అవసరమే. మన శరీరంలో కొత్త కణాల పెరుగుదలలో ఫోలిక్ యాసిడ్ చాలా కీలకం. అలాగే గర్భిణిగా ఉన్న తొలి నెలల్లో బిడ్డ వెన్నెముక, మెదడు ఎదుగుతాయి. అందులో ఫోలిక్ యాసిడ్ కీలకపాత్ర పోషిస్తుంది. తక్కువైతే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ లాంటివి వస్తాయి. గర్భిణులే కాదు, ఆడపిల్లలంతా తొలి నుంచీ ఫోలిక్ యాసిడ్ లోపం లేకుండా చూసుకోవాలి. క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌తో పాటు తోటకూర, పాలకూర, పుట్టగొడుగులు, మొలకలు, స్వీట్ కార్న్ మొదలైన వాటిలో ఇది ఎక్కువగా ఉంటుంది. పండ్లలో నారింజ, ద్రాక్ష, అరటితోపాటు బెర్రీలన్నిటిలో ఫోలిక్ యాసిడ్ అపారంగా దొరుకుతుంది. శనగలు, సోయాబీన్స్, రాజ్మా, కిడ్నీ బీన్స్, వైట్ బీన్స్‌లో కూడా ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది. బాదం, వాల్నట్స్లాంటి గింజల్లోనూ ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ ఫోర్టిఫైడ్ ధాన్యాలు కూడా మంచివే. గర్భ ధారణ తర్వాత కాకుండా.. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోడానికి రెండు నెలల ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు తీసుకోవాలి. అప్పుడే, బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంతో పుడతారు.
– మయూరి ఆవుల,
న్యూట్రిషనిస్ట్, Mayuri.trudiet@ gmail.com
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | హైదరాబాద్‌లో భారీ పేలుడు శబ్దాలు.. భూకంపం వచ్చిందా? బ్లాస్టింగ్ జరిగిందా?
Cyclone Arnab | అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీలో బీచ్‌లను మూసేసిన అధికారులు..!
Ramayana | ‘రామాయణ’ పాటలపై విమర్శలు.. ‘ఆదిపురుష్’తో పోలికలు,ఏఆర్ రెహమాన్ మ్యాజిక్ ఎక్కడంటూ కామెంట్
AP News | ‘అర్నబ్’ ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధం : ఏపీ హోంమంత్రి
Rahul Gandhi: సత్యం శివం సుందరం.. శివుడి త్రిపుండ్రం పోస్టు పెట్టిన రాహుల్ గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

