రోజురోజుకూ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల వినియోగం పెరుగుతున్నది. ఫోన్, ట్యాబ్, ల్యాపీ.. ఇలా ఒక్కరే మూడునాలుగు ఉపకరణాలను వాడాల్సి వస్తున్నది. వీటికోసం మళ్లీ వేర్వేరు చార్జర్స్ ఉండాల్సిందే! ఇక వేరే దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి విద్యుత్ వినియోగానికి అనుగుణంగా.. వేరేవి వాడాల్సిందే! ఈ సమస్యకు ఒకే ఒక్క పరికరం పరిష్కారం చూపుతున్నది.
‘మోమ్యాక్స్-1 వరల్డ్’ పేరుతో వచ్చిన ఈ ఆల్ ఇన్ వన్ వరల్డ్ ట్రావెల్ అడాప్టర్.. ప్రపంచవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ దేశాలను కవర్ చేస్తుంది. మీ ప్రయాణ సమయంలో ప్లగ్‌లను మార్చడంలో ఉండే అన్ని సమస్యలకూ పరిష్కారం చూపుతుంది. ఇందులో జపాన్, అమెరికా, ఆఫ్రికా ఖండం (ఏయూ), యూరోపియన్ యూనియన్ దేశాలు, ఇంగ్లాండ్ దేశాల్లో పనిచేసే యూనివర్సల్ అవుట్లెట్ ఉంటుంది. కాబట్టి, ఆయా దేశాల్లోని ప్లగ్ పాయింట్లకు అనుగుణంగా దీన్ని వాడుకోవచ్చు.
ఇందులో మూడు యూఎస్బీ – సీ, రెండు యూఎస్బీ – ఏ, పోర్టులతోపాటు 1 ఏసీ అవుట్లెట్ ఉంటాయి. 70 వాట్స్ పవర్‌తో ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, పవర్ బ్యాంక్, కెమెరా మొదలైన వాటిని నిమిషాల్లో పూర్తిగా చార్జ్ చేస్తుంది. ఈ పరికరాన్ని ఉపయోగించి ఒకేసారి నాలుగు పరికరాలను చార్జింగ్ చేసుకోవచ్చు. ఐఫోన్ల కోసం ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఆపిల్ వాచ్‌తో సహా అన్నిరకాల స్మార్ట్‌వాచ్‌లు, ఐప్యాడ్ వంటి టాబ్లెట్లు, టీడబ్ల్యూఎస్ బడ్స్ వంటివి ఈజీగా చార్జ్ చేస్తుంది. కేవలం 226 గ్రాముల బరువుండే దీనిని ఎక్కడికైనా సులభంగా తీసుకువెళ్లొచ్చు. కాబట్టి, తరచూ ప్రయాణాలు చేసేవారికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. మీ సమయం, డబ్బును కూడా ఆదా చేస్తుంది.