HomeZindagiEasy And Best Yogasanas For Pregnant Women
చేతులకు బలం
గర్భిణి ఆహార నియమాలను పాటించడంతోపాటు చిన్నచిన్న వ్యాయామాలు చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఈ సూక్ష్మ వ్యాయామం చేతులకు బలాన్నిస్తుంది. మానసిక ఒత్తిడినీ దూరం చేస్తుంది.
ముందుగా నిటారుగా నిలబడాలి. రెండు చేతులనూ ముందుకు చాపి, మోచేతుల దగ్గర వంచాలి. ఇప్పుడు చేతివేళ్లను భుజాలపై ఉంచాలి. భుజాలను నిదానంగా రొటేట్ చేయాలి. క్లాక్వైజ్ పదిసార్లు, యాంటి-క్లాక్వైజ్ పదిసార్లు భుజాలను రొటేట్ చేయాలి.
రెండు చేతులను ముందుకు చాపాలి. అరచేతులను గుప్పిటిలా మూసి మణికట్టును క్లాక్వైజ్ పదిసార్లు, యాంటి-క్లాక్వైజ్ పదిసార్లు రొటేట్ చేయాలి.
చేతులను ముందుకు చాపాలి. చేతివేళ్లను గుప్పిట మూస్తూ, తెరుస్తూ ఇలా పదిసార్లు చేయాలి.
ఎడమ చేతి అరచేతిని ముందుకు చూపుతున్నట్టుగా ఉంచాలి. కుడి అరచేతితో ఎడమ చేతివేళ్లను నిదానంగా వెనక్కి ప్రెస్ చేయాలి. అలాగే, కుడిచేతి వేళ్లను ఎడమ చేతితో వెనక్కి ప్రెస్ చేయాలి.
రెండు చేతులను ముందు చాపి, మోచేతులు బెండ్ చేయాలి. అరచేతులను భుజాలకు ఆనించాలి. చేతివేళ్లతో భుజాలను తాకాలి. ఇలా పదిసార్లు చేయాలి.
ఈ చిన్న వర్కవుట్లవల్ల చేతులకు సత్తువ వస్తుంది. కండరాలు బలంగా తయారవుతాయి. మణికట్టుకు చేవ వస్తుంది. ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. కళ్లు తిరుగుతున్నా, వాంతులు అవుతున్న ఫీలింగ్ ఉన్నా ఇవి చేయక పోవడం మంచిది. ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే వైద్యుడి సలహా తీసుకున్న తర్వాతే ప్రయత్నించాలి.