కలంకారీ వన్నెలు చీరల్ని దాటి.. డ్రెస్సుల్ని తాకి చాలా రోజులే అయ్యింది. ఇప్పుడు వెస్ట్రన్ లుక్లో కనిపించే దుస్తుల్లోనూ ఇది సొగసులీనుతున్నది. ఈస్ట్ అండ్ వెస్ట్ల బెస్ట్ జోడీ అనిపించేలా దీంతో కాంబో డ్రెస్లను రూపొందించారు డిజైనర్లు. జరీ అంచు చేనేత నూలు వస్త్రంతో కలంకారీ అందాన్ని మేళవించారు.
పాచి రంగు అనార్కలీ కుర్తీకి పెన్ కలంకారీ హంగుల్ని అద్దిన ప్లాజో ప్యాంట్ భారతీయ అందాల్ని కళ్లకు కడుతున్నది. అదే పాచి రంగు షార్ట్ టాప్ మీద వెస్ట్ కోట్కి జతైన కలంకారీ అద్దకం పడమటి సంధ్యకు తూరుపు వెలుగుల్ని అద్దినట్టుంది.
-సమతా చౌదరి, డిజైనర్
wowobySamathachowdari