అందానికే కాదు.. ఆరోగ్యం కోసం కూడా ఇప్పుడు చాలామంది ‘బార్లీ టీ’ని ఆశ్రయిస్తున్నారు. కాల్చిన బార్లీ గింజలతో తయారయ్యే ఈ కషాయంతో.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతున్నారు. ఎర్లీ మార్నింగే బార్లీ టీ తాగుతూ.. అందాన్నీ, ఆరోగ్యాన్నీ కాపాడుకుంటున్నారు.
బార్లీ గింజలు – 1 కప్పు, నీళ్లు – 4 లేదా 5 కప్పులు. తయారీ విధానం : బార్లీ గింజలు గోధుమ రంగులోకి వచ్చేదాకా మీడియం మంటపై వేయించుకోవాలి. చల్లారిన తర్వాత వాటిని మెత్తగా పొడి చేసుకోవాలి. ఒక గిన్నెలో నీటిని తీసుకుని.. బాగా మరిగించాలి. అందులో బార్లీ గింజల పొడి వేసుకొని.. 15 నుంచి 20 నిమిషాల వరకు బాగా మరిగించాలి. అంతే.. ఈ కషాయాన్ని వేడివేడిగా తాగొచ్చు. చల్లారిన తర్వాతైనా తీసుకోవచ్చు. రుచి కోసం చక్కెర, తేనె కూడా కలుపుకోవచ్చు.