Doctor Aparna Hegde | రూప నిండు గర్భిణి. ఓ రోజు తనకు తీవ్రమైన హైపర్ టెన్షన్. యూరోగైనకాలజిస్ట్ డాక్టర్ అపర్ణ హెగ్డే దగ్గరికి వెళ్లింది. ఆమె హెల్త్ రికార్డులు తిరగేస్తుంటే.. రూప గర్భం దాల్చిన రెండో నెలలో తాను రాసిన ప్రిస్క్రిప్షన్ కనిపించింది అపర్ణకు. ఆ మహిళను తాను నిర్లక్ష్యం చేశానేమో అన్న అపరాధ భావం చాలారోజులు వెంటాడింది ఆ వైద్యురాలిని. ఆ అనుభవం నుంచి పుట్టుకొచ్చిందే.. ‘అడ్వాన్సింగ్ రిడక్షన్ ఇన్ మోర్టాలిటీ అండ్ మార్బిడిటీ ఆఫ్ మదర్స్, చిల్డ్రన్ అండ్ నియోనేట్స్ (ఆర్మాన్-ARMMAN )’ అనే ఓ మొబైల్ ఆధారిత కౌన్సెలింగ్ సెంటర్. దీని ద్వారా గర్భిణుల కోసం ఆరు భాషల్లో రికార్డ్ చేసిన వాయిస్ కాల్ సేవలు అందిస్తున్నారు.
గర్భధారణ మొదలుకొని ప్రసవం తర్వాత బిడ్డకు ఏడాది వయసు వచ్చేవరకూ.. తల్లీబిడ్డల ఆరోగ్యం, తీసుకోవాల్సిన ఆహారం, మందుల గురించి సూచనలు చేరవేస్తారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంలో ‘కిల్కారి’(బేబీగర్ల్) పేరిట ఈ కార్యక్రమాన్ని చేపట్టారు డాక్టర్ అపర్ణ. పదిహేడు రాష్ర్టాల్లో రెండున్నర కోట్లమంది మహిళలకు ఈ కార్యక్రమం చేరువైంది. ఎంమిత్ర (mMitra) పేరుతోనూ వారానికి రెండుసార్లు గర్భ సంరక్షణ సమాచారాన్ని పంపుతున్నారు. ఈ సేవలు ఎన్నో జీవితాలను నిలుపుతున్నాయి.
Mumbai Cafe Bambai Nazariya | ముంబైలోని ఈ కెఫేలో సిబ్బంది అంతా ట్రాన్స్జెండర్సే!”
అవకాశం వస్తే ఆర్టీసీ డ్రైవర్ కొలువు చేస్తానంటున్న కరీంనగర్ ఆడబిడ్డ.. ఎందుకంటే”
“సాఫ్ట్వేర్ జాబ్ కాదనుకుని అరణ్య మార్గం పట్టింది.. అన్నీ తానై అడవికి ఆయువు పోస్తున్నది”
“ముంబై ఇండియన్స్ క్రికెటర్లు ఏం మాట్లాడాలన్నా డిసైడ్ చేయాల్సింది మన హైదరాబాదీ అమ్మాయే !!”
“Jyoti | ఒకప్పుడు రోడ్లపై భిక్షమెత్తుకుంది.. ఇప్పుడు ఓ కంపెనీకి మేనేజర్ అయ్యింది”