ఆకాశమంత ఎత్తులో.. మిణుగురుల్లాంటి దీపాల వెలుతురులో.. నచ్చిన సంగీతం వింటూ.. మెచ్చినవారితో కలిసి భోజనం చేస్తుంటే.. ఆ మజాయే వేరు! ఆ కలను నిజం చేసుకోవాలనుకుంటే.. బెంగళూరులోని ది షాంగ్రి-లా హోటల్లో ఏర్పాటు చేసిన ‘ద డోమ్ కెఫే’కు వెళ్లండి. తప్పక మీకొక కొత్త ప్రపంచం పరిచయం అవుతుంది. ఆకాశాన్ని తాకే హోటల్ పై అంతస్తుల్లో విలాసవంతమైన డోమ్ కెఫే ఏర్పాటు చేశారు. అక్కడ దేశదేశాల వంటకాలు, ఖండఖండాల సంగీతాలు మిమ్మల్ని కొత్త లోకానికి తీసుకెళ్తాయి. రొమాంటిక్ డేట్, పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం.. తదితర ప్రత్యేక సందర్భాల కోసమే డిజైన్ చేశారు దీన్ని. ఒక్కో డోమ్‌లో 9 మంది వరకూ కూర్చోవచ్చు. వారం రోజులు ముందుగానే బుక్ చేసుకోవాలి.