Santali Saree | సంతాలీ చేనేత చీరలో అందం ఉంటుంది, హుందాతనమూ కనిపిస్తుంది. కాబట్టే, భారత రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ద్రౌపది ముర్ము ఏరికోరి ఆ సంప్రదాయ చీరనే ఎంచుకున్నారు. ఇవి అచ్చమైన చేనేతలు. ఒడిశాలోని సోనేపూర్ జిల్లాతోపాటు ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అస్సాంలో మగ్గాలపై నేస్తారు. ఇందుకు మల్బరీ సిల్క్‌ను ఉపయోగిస్తారు.
పూర్వం ఈ చీరలను గిరిజన మహిళలు ప్రత్యేక సందర్భాల్లో ధరించేవారు. గతంలో స్త్రీల స్వాతంత్య్రం, స్వేచ్ఛ, సాధికారతకు చిహ్నంగా చీరలపై ప్రత్యేకంగా మూడు విల్లులను డిజైన్ చేసేవారు. ప్రస్తుతం ఆధునికతకు తగినట్టు చేపలు, తాబేళ్లు, పక్షుల బొమ్మలతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. గంగ- జమున అని పిలిచే వైవిధ్యమైన బార్డర్ వీటి ప్రత్యేకత. నేతన్నలు తెలుపు, నలుపు, ఎరుపు, పసుపు కాంబినేషన్లనే ఎక్కువగా ఎంచుకుంటారు. నాణ్యతను బట్టి లక్ష రూపాయల వరకూ పలుకుతాయి ఈ చీరలు.
“Gollabhama Sarees | సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాల్లోనే తయారయ్యే ఈ చీరల స్పెషాలిటీ ఏంటంటే..”
“Fashion Sarees | మగువల మనసు దోచేస్తున్న ట్రెండీ కలెక్షన్స్”