e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home జిందగీ ఫలితం పట్టించుకోను!

ఫలితం పట్టించుకోను!

ఫలితం పట్టించుకోను!

హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన హీరోయిన్‌ టబూ హిందీతోపాటు తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. ఇటీవల ‘టెడ్‌ఎక్స్‌’లో మాట్లాడుతూ, తన గురించి చాలా విషయాలను పంచుకున్నారు. “నేనెప్పుడూ నటిని కావాలని అనుకోలేదు. పద్మశ్రీ అవార్డు అందుకుంటానని కలలోకూడా ఊహించలేదు. ఇవన్నీ నేను ఎంచుకున్న కెరీర్‌వల్ల వచ్చినవే. అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం వల్ల సాధించినవే. ఫలితాల గురించి ఆలోచించకుండా నాకు వచ్చిన పాత్రకు వందశాతం న్యాయం చేయడమే నా బాధ్యత అనుకుంటాను. అంతేకాదు, నేను చేస్తున్న పని నన్ను ఎక్కడికి తీసుకెళ్తుందోనన్న ఆందోళనకూడా నాకెప్పుడూ లేదు” అన్నారామె. తానెప్పుడూ కొత్త అనుభవాలను రుచి చూసేందుకు సిద్ధంగా ఉంటానని చెప్పారామె. ఫలితాల గురించి కాకుండా కొత్తగా చేయాల్సిన పనులపై ఫోకస్‌ పెట్టడం వల్లే కెరీర్‌ బాగుంటుందని, మానసిక ప్రశాంతత లభిస్తుందని అభిప్రాయ పడ్డారు. తోటి నటీమణుల గురించి మాట్లాడుతూ, ‘వాళ్లది అసలైన జాబ్‌ కాదు’ అంటారు. ‘నేను ఏ క్యారెక్టర్‌ చేసినా అందులో లీనమైపోతాను. అప్పుడే పుట్టినట్టుగా ఫీలవుతాను. నా పాత్రలద్వారానే ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను’ అంటూ తన భావాలను వ్యక్తంచేశారు టబూ.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఫలితం పట్టించుకోను!
ఫలితం పట్టించుకోను!
ఫలితం పట్టించుకోను!

ట్రెండింగ్‌

Advertisement