Health | మనలో చాలామంది ‘మిస్డ్ కాల్స్’ను పట్టించుకోరు. ఎవరికి తెలుసు? మనం స్పందించని ఆ పిలుపు వెనుక ఓ అత్యవసర కారణం ఉండవచ్చు, జీవితాన్ని మార్చే సమాచారం ఎదురుచూస్తూ ఉండవచ్చు. అదో ప్రమాద హెచ్చరికా కావచ్చు. ఫోన్లోనే కాదు, చాలాసార్లు శరీరం నుంచి కూడా ‘మిస్డ్ కాల్’ లాంటి సంకేతాలు అందుతుంటాయి. నిర్లిప్తతతోనో, నిర్లక్ష్యంతోనో వాటిని విస్మరిస్తే.. ప్రమాదమే. మూడేండ్ల నుంచీ జనం కొవిడ్ గురించే ఆలోచిస్తున్నారు. ఇతర ఆరోగ్య సమస్యలున్నా చికిత్స వాయిదా వేసుకుంటున్నారు. నిజానికి, కొవిడ్ మరణాలతో పోలిస్తే.. గుండెపోటు, క్యాన్సర్ చావులే ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి. తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు ముందు శరీరం కొన్ని సంకేతాలను పంపుతుంది. వాటిని గుర్తించి జాగ్రత్త పడితే గండం గట్టెక్కవచ్చు.
1. ఛాతీలో నొప్పి లేదా అసౌకర్యం.
2. రోజూ తలనొప్పి లేదా దిమ్ముగా ఉండటం.
3. శరీరభాగాలు మొద్దుబారినట్టు అనిపించడం.
4. శ్వాస సరిగా ఆడకపోవడం.
5. శరీరం మీద గడ్డలు.
6. అసహజమైన రక్తస్రావం.
జాగ్రత్త పడకపోతే 2030 నాటికి పిల్లల్లో ఈ ముప్పు తప్పదు!!
రక్తపు బొట్టుతో రోగాల గుట్టు! ‘జీనోమ్ అనాలిసిస్’కు పెరుగుతున్న ఆదరణ
Summer Special… కొబ్బరినీళ్లే కానీ.. లాభాలెన్నో!
వేసవిలో వచ్చే గ్యాస్ సమస్యలకు ఇలా చెక్ పెట్టండి..!