కూరల్లో కరివేపాకు కనిపించగానే.. పక్కన పడేస్తుంటారు. కానీ, అనేక ఔషధ గుణాలున్న కరివేపాకు.. ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెడుతుంది. ఆయుర్వేదంలోనూ విరివిగా ఉపయోగపడుతుంది. అయితే.. అందాన్ని మెరుగుపరచడంలోనూ కరివేపాకు ముందుంటుంది. కరివేపాకు ఫేస్ ప్యాక్.. మచ్చలేని, కాంతిమంతమైన చర్మాన్ని అందిస్తుంది. కరివేపాకులో యాంటి ఆక్సిడెంట్లు, యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటి మైక్రోబయల్ వంటి గుణాలు పుష్కలం. ఇవి చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. చర్మాన్ని మెరిసేలా చేయడంలోనూ సాయపడతాయి. కరివేపాకులో ఉండే ఔషధ గుణాలు.. చర్మానికి తేమను అందిస్తాయి కూడా!