ఒకప్పుడు వ్యక్తి ప్రతిభ గురించి ప్రస్తావిస్తే.. ప్రస్తుతం కట్టుబొట్టుపై విమర్శలు గుప్పిస్తున్నారు. అమెరికాలో ఈ మధ్య జరిగిన సంఘటనే ఇందుకు సాక్ష్యం. భారతీయ మూలాలున్న మథుర శ్రీధరన్ అమెరికాలోని ఓహియో స్టేట్‌కు 12వ సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఎక్స్ (ట్విట్టర్)లో అటార్నీ జనరల్ కార్యాలయం ప్రకటించగా, ఆమె పేరు, శరీర రంగు, పెట్టుకున్న బొట్టు మీద కామెంట్లు చేశారు. ‘సొలిసిటర్ జనరల్‌గా ఇండియన్ ఏంటీ? అమెరికన్స్ కరువయ్యారా? నుదుటన బొట్టు పెట్టుకొని మరీ వచ్చిందండీ కొలువుకి.
బొట్టు పెట్టుకుంటేనే స్థానికులకు కొలువులిస్తారా’ అంటూ ట్రోల్ చేశారు. ఈ కామెంట్లపై ఓహియో అటార్నీ జనరల్ డేవ్ యోస్ట్ స్పందిస్తూ.. ‘మథుర శ్రీధరన్ అమెరికన్ కాదనే అపోహలో చాలామంది ఉన్నారు. కానీ ఆమె అమెరికా పౌరులకు పుట్టిన అమ్మాయి. ఇక్కడి వారినే పెళ్లి చేసుకుంది. ఆమె అనేక అంశాల్లో అవగాహన కలిగి ఉంది. సొలిసిటర్ జనరల్ హోదాకు అర్హతలున్న వ్యక్తి. అయినా కూడా ఆమె పేరు, రంగు మిమ్మల్ని ఇబ్బందిపెడితే తప్పు ఆమెది కాదు, మీ మెదళ్లదంటూ’ అంటూ పోస్ట్ చేశారు.