Cult Gaia Pearl Bag | ముత్యాలంటే అందరికీ ఇష్టమే. చాలామంది ముత్యాల హ్యాండ్ బ్యాగ్‌నూ వాడతారు. కానీ, ఏకంగా ముత్యంలాంటి హ్యాండ్ బ్యాగును తయారు చేయాలన్న వినూత్నమైన ఆలోచన వచ్చింది.. లగ్జరీ హ్యాండ్ బ్యాగులు, యాక్సెసరీల తయారీ సంస్థ.. కల్ట్ గాయా డిజైనర్లకు.
ఆక్రిలిక్పైన మార్బుల్ ఫినిష్‌తో తయారు చేసిన ఈ హ్యాండ్‌బ్యాగ్ ఒక పెద్ద ముత్యాన్ని పోలి ఉంటుంది. బంగారు రంగు హ్యాండిల్‌ను విభిన్న ఆకృతిలో రూపొందించారు. ఈ బ్యాగు ధర రూ. 34,999 మాత్రమే. ఎంత అగ్గువో కదా..!
“Fashion | కరకరలాడే 50-50 బిస్కెట్లలా హాఫ్ అండ్ హాఫ్ ట్రెండ్”