ఆహారం విషయంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఏది తినాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. ముఖ్యంగా, పండ్ల విషయంలో ఆచితూచి స్పందిస్తుంటారు. అయితే, అలాంటివారు ఎక్కువ ఫైబర్, తక్కువ ైగ్లెసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లను ఎంచుకుంటే మంచిది. ఇవి నోటికి రుచిని అందివ్వడంతోపాటు షుగర్కూ చెక్ పెట్టేస్తాయి.
బెర్రీలు: స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్బెర్రీలు, బ్లాక్బెర్రీలు.. వీటిల్లో ఫైబర్, యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. బెర్రీల రకాన్ని బట్టి.. వాటి జీఐ 28-40 మధ్యలో ఉంటుంది. తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండటం వల్ల.. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడంలో సాయపడతాయి.
యాపిల్స్: వీటి జీఐ 32 నుంచి 38 మాత్రమే ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయులను స్థిరంగా ఉంచడంలో ముందుంటుంది. ఆపిల్ తొక్కలో అధిక మొత్తంలో ఫైబర్ లభిస్తుంది. కాబట్టి ఆపిల్ను తొక్కతోసహా తినాలి.
కివీ: 50 కన్నా తక్కువ జీఐ కలిగిన కివీ.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన ఎంపిక. చక్కెర మితంగా ఉండే ఈ పండ్లలో.. విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది.
అవకాడో: తక్కువ కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండిన అవకాడో జీఐ.. దాదాపు 40 వరకూ ఉంటుంది. ఇందులో గుండె ఆరోగ్యానికి భరోసా ఇచ్చే పొటాషియం, ఫోలేట్ అధికంగా లభిస్తుంది. డయాబెటిక్ డైట్లో చేర్చుకోవడానికి బాగుంటుంది.
సిట్రస్ పండ్లు: ద్రాక్ష, నారింజ లాంటి సిట్రస్ పండ్లు మధుమేహం ఉన్నవారికి మంచి ఎంపిక. వీటి జీఐ 43 వరకూ ఉంటుంది. గుండెకు మేలుచేసే యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా లభిస్తాయి.