చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో.. సరికొత్త ప్రీమియం మోడల్స్‌ను విడుదల చేసింది. రెనో-15 సిరీస్‌లో భాగంగా రెనో-15 ప్రో, రెనో-15 ప్రో మినీతోపాటు రెనో-15 ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏఐ ఎడిటింగ్ టూల్స్‌తోపాటు 200 ఎంపీ కెమెరా వంటి అత్యాధునిక ఫీచర్లను పొందుపరిచింది. ఈ మూడు ఫోన్లు వరుసగా.. ఐపీ 66, ఐపీ 68, ఐపీ 69 రేటింగ్స్‌తో వస్తున్నాయి. డస్ట్ రెసిస్టెంట్స్తోపాటు నీటిలో మునిగిపోయినా, 80 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల్లోనూ చక్కగా పనిచేస్తాయి.
ఈ ఫోన్ల ప్రత్యేకతల విషయానికి వస్తే.. రెనో-15 ప్రో మినీలో 6.32 అంగుళాల AMOLED డిస్ప్లే, రెనో-15 వెర్షన్లో 6.59-అంగుళాల AMOLED డిస్ప్లేను ఏర్పాటుచేశారు. రెనో-15 ప్రో మోడల్లో 6.78-అంగుళాల AMOLED డిస్ప్లే ఉంది. ఈ మూడు స్క్రీన్లు.. FHD+ రిజల్యూషన్‌తోపాటు 10-బిట్ కలర్, 120 Hz వరకూ రిఫ్రెష్ రేట్లను అందిస్తున్నాయి. ఒప్పో రెనో-15 ప్రోతోపాటు రెనో-15 ప్రో మినీ మోడల్స్‌లో 200 ఎంపీ మెయిన్ కెమెరా సెన్సర్, 50 ఎంపీ టెలిఫొటో లెన్స్‌తోపాటు మరో 50 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా సెటప్‌తో వస్తున్నాయి. ముందు భాగంలో 50 ఎంపీ సెల్ఫీ కెమెరాను ఏర్పాటుచేశారు.
ఫొటోలతోపాటు 60 ఎఫ్‌పీఎస్ వరకూ 4కె హెచ్‌డీఆర్‌లో వీడియో రికార్డింగ్‌ను అందించేలా వీటిని తీర్చిదిద్దారు. రెనో-15 ప్రో, రెనో-15 ప్రో మినీలో మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్‌ను ఏర్పాటుచేయగా.. రెనో-15 స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్‌పై నడుస్తుంది. రెనో-15 ప్రోలో 6,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్స్ SUPERVOOC ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్స్ ఏఐRVOOC వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నది. రెనో-15లో 6,500 ఎంఏహెచ్ బ్యాటరీ, రెనో-15 ప్రో మినీలో 6,200 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటుచేశారు. ఇవి రెండూ 80వాట్స్ SUPERVOOC ఫాస్ట్ చార్జింగ్కు మద్దతు ఇస్తాయి. ఈ మూడు మోడల్స్ 12 జీబీ ర్యామ్+ 256 జీబీతో ఇంటర్నల్ మెమొరీతోపాటు 12జీబీ ర్యామ్ + 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తున్నాయి. అన్ని ప్రధాన ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులోకి వచ్చాయి.