కావలసిన పదార్థాలు: గుడ్లు: నాలుగు, పచ్చిమిర్చి: నాలుగు, క్యాప్సికమ్: ఒకటి, ఉల్లిగడ్డ: ఒకటి, మిరియాల పొడి: పావు టీస్పూన్, కారం: ఒక టీస్పూన్, అల్లం, వెల్లుల్లి తురుము: అర టీస్పూన్ చొప్పున, పసుపు: పావు టీస్పూన్, ఉప్పు: తగినంత, ధనియాల పొడి: ఒక టీస్పూన్, కొత్తిమీర తురుము: కొద్దిగా, నూనె: రెండు టేబుల్ స్పూన్లు.
తయారీ విధానం : గుడ్లను ఉడికించి పొడవుగా నాలుగు ముక్కలు చెయ్యాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి నూనెవేసి వేడయ్యాక సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి తురుము, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేయించాలి. అన్నీ బాగా వేగాక క్యాప్సికమ్, గుడ్డు ముక్కలు వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి. పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, మిరియాల పొడి కూడా జోడించి మళ్లీ వేయించాలి. చివరగా కొత్తిమీర తురుము చల్లుకుంటే నోరూరించే చిల్లీ ఎగ్స్ సిద్ధం.