బిర్యానీ ఆకు మంచి మసాలా మాత్రమే కాదు.. మంచి ఔషధం కూడా! వంటలకు ప్రత్యేక రుచిని తెచ్చే ఈ ఆకు.. ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. బిర్యానీ ఆకులు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆహారాన్ని త్వరగా జీర్ణంచేసే ఎంజైమ్‌లను పెంచుతాయి. దాంతో అజీర్తి, మలబద్దకం దరి చేరవు. మూత్ర సంబంధ సమస్యలు, కిడ్నీలో రాళ్లను దూరం చేస్తాయి. బిర్యానీ ఆకుల్లో ఫైటో కెమికల్స్ అధిక మోతాదులో ఉంటాయి. ఇవి షుగర్‌ను కంట్రోల్ చేస్తాయి. వీటిని తీసుకుంటే టైప్-2 డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన బిర్యానీ ఆకులు.. ఎముకల్లో నొప్పి, వాపును తగ్గిస్తాయి కూడా. బిర్యానీ ఆకుల్లో యాంటి క్యాన్సర్ గుణాలు అధికం. ఇవి శరీరంలో క్యాన్సర్ కణాలను తగ్గిస్తాయి. వీటిలో పుష్కలంగా లభించే యాంటి ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్.. ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. శరీరంలో హానికర ట్యాక్సిన్లనూ తొలగిస్తాయి. బిర్యానీ ఆకుల్లో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా లభిస్తాయి. వీటిలోని విటమిన్ సి, విటమిన్ ఇ, కెరోటినాయిడ్స్.. రక్తంలో కొలెస్ట్రాల్, యూరిక్ యాసిడ్ స్థాయులను తగ్గిస్తాయి. బిర్యానీ ఆకులు రెగ్యులర్‌గా తీసుకుంటే.. ఇన్ఫెక్షన్ల బారినుంచి బయట పడవచ్చు. వీటిలోని ఔషధ గుణాలు.. శ్లేష్మాన్ని తగ్గిస్తాయి. శ్వాస వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.