ఎవర్”గ్రీన్’ కురులు మీవే..
బరువు తగ్గడానికో మార్గం గ్రీన్ టీ. పని ఒత్తిడిని చిత్తు చేసే అస్త్రం గ్రీన్ టీ. ఇంటింటా మసలుతున్న గ్రీన్ టీ ఇప్పుడు సాటిలేని సౌందర్యానికి మేటి ఎంపికగా నిలుస్తున్నది. కురుల పటుత్వానికి గ్రీన్ టీ టిప్స్ ఫాలో అవుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది.
బరువు తగ్గడానికో మార్గం గ్రీన్ టీ. పని ఒత్తిడిని చిత్తు చేసే అస్త్రం గ్రీన్ టీ. ఇంటింటా మసలుతున్న గ్రీన్ టీ ఇప్పుడు సాటిలేని సౌందర్యానికి మేటి ఎంపికగా నిలుస్తున్నది. కురుల పటుత్వానికి గ్రీన్ టీ టిప్స్ ఫాలో అవుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. ఎవర్గ్రీన్ కేశ సౌందర్యానికి మీరూ ఈ టిప్స్ ఫాలో అవ్వండి.
- ఒక స్పూన్ గ్రీన్ టీ పొడిలో గుడ్డులోని పచ్చసొన, అర టీస్పూన్ ఆవపిండి కలిపి జుట్టుకు రాసుకోవాలి. 15-20 నిమిషాల తర్వాత ఏదైనా షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండు లేదా మూడుసార్లు ఈవిధంగా చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
- రెండు కప్పుల నీటిలో ఒక టీ స్పూన్ గ్రీన్ టీ పొడి వేసి బాగా మరిగించాలి. తలస్నానం చేసిన తర్వాత ఈ నీటిని కుదుళ్లకు పట్టించి మసాజ్ చేసి అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా తరచుగా చెయ్యడం వల్ల కుదుళ్లకు మంచి పోషణ అందుతుంది. దీంతో జుట్టు దృఢంగా మారుతుంది.
- అర కప్పు కొబ్బరినూనెలో ఒక స్పూన్ గ్రీన్ టీ పొడి వేసి బాగా కలిపి తలకు పట్టించాలి. అరగంట సమయం తర్వాత షాంపూ అప్లయ్ చేసి గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు క్రమం తప్పకుండా చేస్తే జుట్టు ఆరోగ్యంగా మారుతుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

