కట్టమీది నిమ్మ ఉయ్యాలో..
కాయల్ల నిమ్మ ఉయ్యాలో..
ధనిపూత పూసిందే ఉయ్యాలో..
భూకైవాసనలే ఉయ్యాలో..
ధనికాత గాసిందె ఉయ్యాలో..
గజ్జెవారి కాత ఉయ్యాలో..
ధని పండు మక్కిందె ఉయ్యాలో..
పన్నెండు రుచులే ఉయ్యాలో..
యెముడాల రాజన్న ఉయ్యాలో..
పండోయి పండు ఉయ్యాలో..
ఆ పండు గోనాలె ఉయ్యాలో..
నేను దీనాలె ఉయ్యాలో..
కొండగట్టు అంజన్న ఉయ్యాలో..
పండోయి పండు ఉయ్యాలో..
ఆడికెళ్లి ఆ బండి ఉయ్యాలో..
సిరిసైలం దాకా ఉయ్యాలో..
సిరిసైలం మల్లన్న ఉయ్యాలో..
పండోయి పండు ఉయ్యాలో..
ఆ పండు గోనాలె ఉయ్యాలో..
పండోయి పండు ఉయ్యాలో..
పుట్టలున్న నాగన్న ఉయ్యాలో..
పండోయి పండు ఉయ్యాలో..
పడిగ తాకట్టు వెట్టి ఉయ్యాలో..
పండు గోనాలె ఉయ్యాలో..
॥ కట్టమీద ॥