అరటి ఆకులో అద్భుతాలు..
భారతీయుల ఆహారపు అలవాట్లే కాదు.. సంస్కృతీ సంప్రదాయాలు కూడా ప్రకృతికి దగ్గరగా ఉంటాయి. తులసి, అరటి వంటి అనేక పెరటి మొక్కలు.. ఇంటింటా పూజలు అందుకుంటాయి. ఆరోగ్యాన్ని ప్రసాదించే దివ్యౌషధాలుగానూ ఉపయోగపడుతుంటాయి. ముఖ్యంగా.. అరటి ఆకులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కల్పిస్తుంటాయి.
భారతీయుల ఆహారపు అలవాట్లే కాదు.. సంస్కృతీ సంప్రదాయాలు కూడా ప్రకృతికి దగ్గరగా ఉంటాయి. తులసి, అరటి వంటి అనేక పెరటి మొక్కలు.. ఇంటింటా పూజలు అందుకుంటాయి. ఆరోగ్యాన్ని ప్రసాదించే దివ్యౌషధాలుగానూ ఉపయోగపడుతుంటాయి. ముఖ్యంగా.. అరటి ఆకులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కల్పిస్తుంటాయి.
అరటి ఆకుల్లో భోజనం చేయడం మన సంప్రదాయం మాత్రమే కాదు.. ఆరోగ్యకరం కూడా! అరటి ఆకుల్లో ఉండే పాలీఫినాల్స్, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలు శరీరానికి మేలుచేస్తాయి. వీటిపై భోజనం వడ్డించగానే.. ఈ పోషకాలు ఆహారంలోకి చేరతాయి. అరిటాకులు సహజసిద్ధమైన క్రిమిసంహారకాలుగా పనిచేస్తాయి. ఆహారంలోని హానికారక బ్యాక్టీరియాను నశింపజేస్తాయి. వంటకాల రుచిని పెంచుతాయి. అరిటాకుల్లో ఎసెన్షియల్ ఫైటో న్యూట్రియెంట్స్, మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం, సెలీనియం, ఫైబర్ వంటి పోషకాలతోపాటు మరెన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి అనేక వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి. అరిటాకులు నేచురల్ డ్రెస్సింగ్గానూ ఉపయోగపడతాయి. బొబ్బలు, కాలిన గాయాలను మాన్పడంలో సాయపడతాయి. అరిటాకుపై కొబ్బరినూనె రాసి.. బొబ్బలపై ఉంచితే మంచి ఫలితం ఉంటుంది.
అరిటాకును కాల్చి తేనెతో కలిపి తీసుకుంటే.. ఎక్కిళ్లు ఇట్టే ఆగిపోతాయి అరిటాకులో ఉండే ‘లిగ్నిన్’.. ముఖంపై చర్మం పొడిబారడం, కందిపోవడాన్ని తగ్గిస్తుంది. చర్మాన్ని తేమగా ఉంచడంతోపాటు అలర్జీలు, దద్దుర్లు మొదలైన వాటి నుంచి అరిటాకులు ఉపశమనం కలిగిస్తాయి. జీర్ణ లక్షణాలను మెరుగుపరచడం, అతిసారం, విరేచనాలను తగ్గించడంలో అరిటాకు ముందుంటుందని నేషనల్ లైబ్రరీ అఫ్ మెడిసిన్ చెబుతున్నది. అరిటాకుల్లో యాంటి ఆక్సిడెంట్లు అధికం. ఇవి శరీర కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి, వైరల్ ఇన్ఫెక్షన్లను తగ్గించడానికీ సాయపడతాయి. అరిటాకుల్లో పుష్కలంగా లభించే ఐరన్.. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయులను పెంచడానికి సహాయపడుతుంది. విటమిన్ బి6, పొటాషియం.. రక్తపోటును నియంత్రిస్తాయి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

