Anupama Parameswaran | ‘టిల్లు స్వేర్’తో అందరినీ ఆకట్టున్న నటి అనుపమ పరమేశ్వరన్. ఒద్దికగా ఉండే ఈ చిన్నది.. ఒక్కసారిగా కెరటంలా ఎగిసిపడటంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇదే విషయమై అనుపమను అడిగితే.. లిల్లీ పాత్ర తనకెంతో నచ్చిందని చెప్పుకొచ్చింది. ‘నా తొలి సినిమా ‘ప్రేమమ్’. అప్పుడు నా వయసు 19 ఏండ్లు. నా కెరీర్ ప్రారంభమై పదేండ్లవుతున్నది. మూడేండ్లుగా ప్రయోగాత్మక పాత్రలను ఎంపిక చేసుకుంటున్నా.
ఆ టైమ్‌లో నా దగ్గరికి ‘టిల్లు స్కేర్’ కథ వచ్చింది. చాలా నచ్చింది. ఆ సినిమాలోని లిల్లీ పాత్రను వదులుకోకూడదని డిసైడ్ అయ్యా. నా కెరీర్లో ఈ పాత్ర ప్రత్యేకం. ఇంతకుముందు అన్ని సినిమాల్లో ఒకేలాంటి పాత్రల్లో నటించడంతో బోర్ ఫీలయ్యా! లిల్లీ పాత్ర గ్లామర్‌తోపాటు పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్నది. పాత్ర కోసం గ్లామర్‌గా కనిపించానే తప్ప హీరోయిన్ ఇమేజ్ కోసం కాదు.. అయినా అందంగా కనిపించడం మంచిదే కదా!’.. అంటూ నవ్వుతూ చెప్పిందీ గ్లామర్ స్క్వేర్ గర్ల్!!