Home
Zindagi
Anger In Brain And Body The Neural And Physiological Perturbation Of Decision Making By Emotion
ఆగ్రహంతో అనర్థాలెన్నో
అప్పుడప్పుడూ కోపం రావడం సహజమైన భావోద్వేగమే! అసలు సమస్య మొదలయ్యేది మాత్రం.. అది మితిమీరినప్పుడే! అకారణమైన కోపం.. ఆత్మీయులను కూడా శత్రువులుగా మార్చేస్తుంది. ముఖ్యంగా నేటితరంలో ఓపిక నశించిపోయి..
అప్పుడప్పుడూ కోపం రావడం సహజమైన భావోద్వేగమే! అసలు సమస్య మొదలయ్యేది మాత్రం.. అది మితిమీరినప్పుడే! అకారణమైన కోపం.. ఆత్మీయులను కూడా శత్రువులుగా మార్చేస్తుంది. ముఖ్యంగా నేటితరంలో ఓపిక నశించిపోయి.. ఆగ్రహం అధికమవుతున్నది. అది వారి మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నది. ఈక్రమంలో ఆగ్రహాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉన్నది.
- కోపానికి గురైనప్పుడు శరీరంలో ‘ఫైట్ ఆర్ ఫ్లయిట్’ అనే ప్రతిచర్య మొదలవుతుంది. దీనివల్ల అడ్రినలిన్, కార్టిసాల్ వంటి హార్మోన్లు విపరీతంగా విడుదలవుతాయి. ఇవి శరీరంలోని వివిధ అవయవాల పనితీరుపై ప్రభావం చూపుతాయి.
- కోపం వచ్చినప్పుడు సహజంగానే గుండె వేగంగా కొట్టుకుంటుంది. రక్తపోటు అధికం అవుతుంది. అయితే, ఇలా తరచుగా కోపానికి రావడం వల్ల గుండె ధమనులు దెబ్బతింటాయి. దీర్ఘకాలంలో గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.
- అధిక కోపం వల్ల శరీరంలో కార్టిసాల్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది రోగనిరోధక శక్తిని బలహీనం చేస్తుంది. ఫలితంగా, ఇన్ఫెక్షన్లు ఇట్టే సోకుతాయి. చిన్నపాటి గాయాలు మానడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది.
- కోపంలో ఉన్నప్పుడు విచక్షణ కోల్పోతారు. నిర్ణయ సామర్థ్యం కూడా తగ్గుతుంది. ఆ సమయంలో తీసుకునే తప్పుడు నిర్ణయాలు.. జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.
- మెదడు, జీర్ణవ్యవస్థకు మధ్య బలమైన సంబంధం ఉంటుంది. కోపం.. జీర్ణవ్యవస్థపైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది. కోపం వల్ల కడుపులో ఆమ్లాలు అధికంగా విడుదలవుతాయి. దీనివల్ల అజీర్ణం, గ్యాస్ సమస్యలు, అల్సర్లు, ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’ వంటి సమస్యలు తలెత్తుతాయి.
- కోపం వల్ల మెదడులోని నరాలు ఒత్తిడికి గురవుతాయి. ఫలితంగా విపరీతమైన తలనొప్పి, మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలికంగా కొనసాగితే.. జ్ఞాపకశక్తిపైనా ప్రభావం చూపుతుంది.
- శరీరంలో పెరిగే ఒత్తిడి స్థాయులు.. చర్మాన్ని ప్రభావితం చేస్తాయి. కొందరిలో కోపం వల్ల చర్మంపై దద్దుర్లు, దురద, ఎగ్జిమా వంటి సమస్యలు వస్తాయి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

