గురువారం 25 ఫిబ్రవరి 2021
Zindagi - Jan 30, 2021 , 00:47:01

వారికీ ఓ పత్రిక!

వారికీ ఓ పత్రిక!

మదురైకి చెందిన ప్రియ ట్రాన్స్‌ జెండర్లకు వేదికగా 2017లో మదురైలో ‘ట్రాన్స్‌జెండర్‌ రిసోర్స్‌ సెంటర్‌'ను స్థాపించారు. ఈ సెంటర్‌లో మూడో ప్రకృతి వ్యక్తులకు సంబంధించిన న్యూస్‌ పేపర్‌ క్లిపింగులు, డాక్యుమెంటరీలు, షార్ట్‌ ఫిల్ములు, ప్రభుత్వ జీవోలు ఉంటాయి. గత నవంబర్‌లో ‘ట్రాన్స్‌ న్యూస్‌' పేరుతో ఓ ప్రత్యేక వెబ్‌ పత్రికను మొదలుపెట్టారు ప్రియ. దీనిలో ప్రచురితమయ్యే వ్యాసాలన్నీ ట్రాన్స్‌జెండర్లు రాసినవే. ఫ్యాషన్‌, బ్యూటీ, గృహాలంకరణ, ఆరోగ్యం వంటి అంశాలపైనా కథనాలు ఉంటాయి. ఉద్యోగ సమాచారాన్ని కూడా అందుబాటులో ఉంచుతున్నారు. మోడలింగ్‌లోకి అడుగుపెట్టిన ట్రాన్స్‌జెండర్లకు ప్రచారం కల్పిస్తున్నారు. తొలి ట్రాన్స్‌జెండర్‌ న్యూస్‌రీడర్‌ పద్మినీ ప్రకాశ్‌ గురించి కథనం ఇచ్చారు. ట్రాన్స్‌ ఆంత్రప్రెన్యూర్‌ జీవా రంగరాజ్‌ ఇంటర్వ్యూను ప్రచురించారు. ‘ట్రాన్స్‌ న్యూస్‌' చందా ఉచితం. ప్రస్తుతం ఈ పత్రిక ఇంగ్లిష్‌, తమిళ భాషల్లో వెలువడుతున్నది. త్వరలోనే హిందీ, మరాఠీ, తెలుగు, కన్నడ భాషల్లోనూ తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 


VIDEOS

logo