శంషాబాద్, జూన్ 3: జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పో ర్టుకు ఏసీఐ ఆసియా -పసిఫిక్ గ్రీన్ ఎయిర్పోర్ట్స్ గోల్డ్ రికగ్నైషన్ -2021 లభించింది. ఎయిర్పోర్టు క్వాలిటి నిర్వహణ కార్యకలాపాలను ప్రస్తుతించిన ఏసీఐ… ఈ అవార్డును ప్రకటించినట్లు కంపెనీ అధికార వర్గాలు తెలిపారు. వరుసగా 4వ ఏడాది ఈ అవార్డు రావడం గమనార్హం.