శనివారం 31 అక్టోబర్ 2020
Zindagi - Aug 29, 2020 , 23:15:30

నా చెట్టు పోయింది సార్‌

నా చెట్టు పోయింది సార్‌

 ఓ పిల్లాడు పోలీసుల దగ్గరకొచ్చి ‘నా చెట్టు పోయింది సార్‌ ’అంటూ ఫిర్యాదు చేశాడు. అది విన్న పోలీసులు షాక్‌ అయ్యారు.   

కేరళలోని ఎర్నాకుళం జిల్లాకు చెందిన పవన్‌ నాశ్‌ అనే అబ్బాయి ఆరో తరగతి చదువుతున్నాడు. అతను రెండు సంవత్సరాల క్రితం  ఓ ఉసిరి మొక్కను నాటాడు.  లాక్‌ డౌన్‌తో స్కూళ్లు మూసివేయటంతో చుట్టాల ఇంటికి వెళ్లాడు. అలా వెళ్లిన పవన్‌ గత సోమవారం ఇంటికి వచ్చాడు.  ఉసిరి మొక్క  దగ్గరకు వెళ్లాడు.  ఆ మొక్క సగానికి నరికేసినట్లుగా ఉంది. దీంతో పోలీసుల దగ్గరకు వెళ్లాడు. తన మొక్క పోయిందని కంప్లెయింట్‌ ఇచ్చాడు. పోలీసులు చొరవ తీసుకున్నారు.  కేరళ ప్రభుత్వం చిన్నారుల మానసిక క్షేమం కోసం ప్రవేశపెట్టిన కౌన్సెలింగ్‌ కార్యక్రమం ‘చిరి’ (నవ్వు)ని సంప్రదించారు. ఆ సభ్యులు పవన్‌కు మొక్కలు అందించారు. ఆ మొక్కలకు పవన్‌ చిరి అనే పేరుపెట్టుకున్నాడు.  దీంతో పాటు స్థానిక పోలీసు అధికారులు మరో తొమ్మిది మొక్కలను పవన్‌ ఇంటికి తీసుకెళ్లి బహుమతిగా ఇచ్చారు.