శనివారం 08 ఆగస్టు 2020
Zindagi - Jul 26, 2020 , 23:19:46

ఎవరితోనూ పోల్చుకోకండి!

ఎవరితోనూ పోల్చుకోకండి!

మనల్ని మనం ప్రేమించుకోవాలనీ, ఇతరులతో పోల్చుకోవడం మానేయాలనీ, హ్యాపీగా ఉన్నామా లేదా అన్నదే ముఖ్యమనీ.. అభిమానులకు సలహా ఇస్తున్నది నటి సమీరారెడ్డి. ఇటీవల ఒక యువతి పంపిన మెసేజ్‌కు స్పందనగా.. బాడీ షేమింగ్‌పై ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ మధ్యనే అమ్మ అయిన తాను బరువు పెరిగాననీ, తన శరీరం తనకేనచ్చడం లేదనీ, కొన్నిసార్లు చండాలంగా ఉన్నట్టు అనిపిస్తుందనీ.. ఆ మహిళ బాధపడిపోయిందట. ఆమెను ఓదారుస్తూ మనసులో గూడుకట్టుకున్న భావాల్ని నలుగురితో పంచుకుంది సమీరా. ‘చెల్లీ! నేనూ అలాంటి వివక్షలు చాలానే ఎదుర్కొన్నాను. చిన్నప్పటి నుంచీ సిస్టర్స్‌తోనో  మరొకరితోనో పోలుస్తున్నారు. 

పని చేసే పరిశ్రమలో సైతం తేడాలు భరించాను. అందుకే అందంగా కనిపించేందుకు విశ్వప్రయత్నాలూ చేశాను. మేకప్‌, ప్యాడ్స్‌, లెన్స్‌.. ఇలా ఏ అవకాశాన్నీ వదులుకోలేదు. నిజానికి, మనం ఎలా ఉన్నామన్నది ముఖ్యం కాదు. మన దగ్గర ఉన్నదానితో హ్యాపీగా ఉండటం నేర్చుకోవాలి. ముందు ఇబ్బందిపడినా, తర్వాత లైట్‌గా తీసుకున్నాను. నువ్వూ అలాగే ఉండటం నేర్చుకో’ అంటూ సాంత్వన వాక్యాలు పలికింది.  logo