శనివారం 31 అక్టోబర్ 2020
Zindagi - Jul 21, 2020 , 23:41:57

హనుమంతుడిలా ఊహించుకొని గెంతులు

హనుమంతుడిలా ఊహించుకొని గెంతులు

పీవీ నరసింహారావుకు హనుమంతుడు ఇష్టదైవం. చిన్నపుడు తనను తాను హనుమంతుడిలా ఊహించుకొనేవారు. కుర్చీలోంచి గెంతడం, రావణుడి లంకకు నిప్పు పెట్టినట్టు నటించడం పీవీకి ఆనందం కలిగించేవి. బాల్యంలో ఆయన మహాభారతం, రామాయణ పురాణగాథలను ఇష్టంగా చదివేవారు. అందులోని పాత్రలను తనకు అన్వయించుకునేవారు. అన్ని పాత్రల్లోకెల్లా ఆంజనేయస్వామి వేషం వేసుకొని నటించడం అంటే ఆసక్తి చూపేవారు. ఓసారి, తాడుతో చేసిన తోకను తగిలంచుకొని పశువుల కొట్టానికి నిప్పు పెట్టారు.