సోమవారం 06 జూలై 2020
Zindagi - Jun 30, 2020 , 00:06:14

పాఠ్యాంశంగా చిన్నారి మంచిపని

పాఠ్యాంశంగా చిన్నారి మంచిపని

బుడిబుడి అడుగులు వేసుకుంటూ బడికి వెళ్లే చిన్నారి ఓ మంచిపని చేసి, పుస్తకాల్లో పాఠంగా మారింది. ఒకప్పుడు ఎంతోమంది పర్యాటకులను ఆకర్షించిన జమ్మూకశ్మీర్‌ శ్రీనగర్‌లోని దాల్‌ సరస్సు నేడు నాచు పేరుకుపోయి  కళావిహీనంగా మారింది. ప్రకృతి అందాలకు నిలయమైన ఆ సరస్సును శుద్ధి చేయాలన్న ఆలోచన కలిగింది.. జన్నత్‌ అనే చిన్నారికి. తన చిట్టి చేతులతో సరస్సును శుభ్రం చేయడం మొదలు పెట్టింది. గత రెండేండ్లుగా తన తండ్రితో కలిసి ఆ పనే చేస్తున్నది. ఆ ప్రయత్నాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మెచ్చుకుంది. దీంతో జన్నత్‌ సక్సెస్‌ స్టోరీ తెలంగాణ విద్యార్థులకు పాఠ్యాంశంగా మారింది. తాను సరస్సును శుభ్రం చేయడం వెనుక తండ్రి ప్రేరణ ఉందని సగర్వంగా చెబుతున్నది ఏడేండ్ల జన్నత్‌.logo