కావలసిన పదార్థాలు
రాగులు: అర కప్పు, యాపిల్: ఒకటి, చక్కెర: ఒక టేబుల్ స్పూన్, తరిగిన డ్రైఫ్రూట్స్: ఒక టేబుల్ స్పూన్, నెయ్యి: ఒక టీస్పూన్, ఇలాచీ పొడి: చిటికెడు.
తయారీ విధానం
స్టవ్‌మీద పాన్‌పెట్టి రాగులను సన్నని మంటపై దోరగా వేయించాలి. చల్లారిన తర్వాత వాటిని మిక్సీలో మెత్తగా పిండిలా చేసుకోవాలి. యాపిల్ తొక్క తీసి ముక్కలుగా కోయాలి. స్టవ్‌మీద గిన్నెపెట్టి యాపిల్ ముక్కల్లో ఒక కప్పు నీళ్లుపోసి మెత్తగా ఉడికించాలి. ఒక గిన్నెలో రాగి పిండి, తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి సన్నని మంటపై రెండు నిమిషాలు ఉడికించాలి. రాగిపిండి దగ్గర పడుతుండగా యాపిల్ ముక్కలు, చక్కెర, ఇలాచీ పొడి వేసి మరింత ఉడికించాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి, నెయ్యి వేడయ్యాక డ్రైఫ్రూట్స్ వెయ్యాలి. బాగా వేగాక రాగి మిశ్రమం జోడిస్తే రాగి యాపిల్ హల్వా సిద్ధం.