ఆహ్లాదకరమైన రంగులలో, ముచ్చటైన మడతలతో వైవిధ్యంగా కనిపించే ఈ గౌన్లు చిన్నపిల్లలకు కొత్త మెరుపును తెస్తాయి. పుట్టినరోజు వంటి సందర్భాల్ల్లో చిట్టి
తల్లులు మరింత అందంగా మెరిసిపోతారు. ప్రత్యేకమైన థీమ్‌లతో రూపొందించిన ఈ పొడవాటి గౌన్లు వేస్తే, దిష్టి తీయక తప్పదు మరి!
యునికాన్ థీమ్
వైట్ కలర్ నెట్టెడ్ క్లాత్కి నాలుగు రంగులతో డై వేయించి, డిజైన్ చేసిన ఫ్రాక్ ఇది. పిల్లలకి బేబీ పింక్ కలర్ అందంగా కనిపిస్తుంది. అందుకే, ఎక్కువగా పింక్ కలర్‌ని హైలెట్ చేశారు. కింద ప్రిల్స్లో ఉన్న కలర్స్‌తోనే రూపొందించిన యునికాన్ ఎంబ్రాయిడరీ డిజైన్ని ఫ్రాక్పైన ప్యాచ్ చేశారు. గ్రాండ్ లుక్ కోసం గుబురుగా ప్రిల్స్ పెట్టారు. ఫ్యాబ్రిక్ సిల్క్‌తో రూపొందించిన ఈ ఫ్రాక్‌కి నప్పేలా ఫ్రీ హ్యాండ్స్ డిజైన్ చేశారు. అచ్చంగా యునికాన్ థీమ్‌కి సరిపోయేలా..అలలను పోలినట్టు రూపొందించారు.
ఏంజిల్ థీమ్
స్వచ్ఛతకు చిహ్నం తెలుపు. కల్మషం లేని నవ్వు, అమాయకపు చూపులతో అందరి మనసులనూ దోచే చిన్నారి పాపాయికి తెలుపురంగు గౌను చక్కగా నప్పుతుంది. పాల నురగలా కనిపిస్తున్న ఈ గౌనుకు, దాదాపు ఇరవై మీటర్ల వైట్ నెట్ క్లాత్‌ని ప్రిల్స్లా రూపొందించారు. ఈ ఫ్రాక్ వేసుకున్న చిన్నారి నింగి నుంచి నడిచొచ్చిన దేవతలా అందరి మనసులనూ ఇట్టే దోచేస్తుంది. రౌండ్ నెక్‌తో, చిన్నచిన్న పూసలతో చేసిన డిజైన్‌వల్ల గ్రాండ్‌లుక్ కనిపిస్తుంది. పిల్లలకి నెట్టెడ్ క్లాత్ కారణంగా దురద, చిరాకు వంటి ఇబ్బందులు కలుగకుండా లోపల కాటన్ లైనింగ్‌ని వాడారు.
బటర్‌ఫ్లై థీమ్
సాధారణంగా ఆడపిల్లలకు పింక్ అంటే ఇష్టం. అందుకే, వాళ్లు వేసుకునే దుస్తులేకాదు.. ఆడుకునే బొమ్మలు, వాడే వస్తువులు కూడా ఎక్కువగా ఆ రంగువే అయి ఉంటాయి. అందుకే ఈ గౌనులో ఎక్కువగా పింక్ కలర్ వాడారు. వైట్ నెట్టెడ్ క్లాత్‌మీద పింక్ కలర్ బటర్‌ఫ్లైలను అతికించడంతో గౌను మొత్తం పింక్ అండ్ వైట్‌లో అందంగా ఇమిడిపోయింది. పై భాగంలో స్టోన్స్‌తో చేసిన బటర్‌ఫ్లై మరింత అందాన్ని తెచ్చిపెట్టింది. చేతులు కూడా పింక్, వైట్ కలర్లో ఫ్రీగా వదిలేయడంతో భలేగా కనిపిస్తుంది.
డిజైనర్
నిహారికా రెడ్డి
నిహారిక డిజైన్ స్టూడియో
ఫోన్ : 8008322377
NiharikaReddy
TheDesigner.
facebook.com,