e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home యాదాద్రి ప్రగతికి చిరునామా ఫకీరుగూడెం

ప్రగతికి చిరునామా ఫకీరుగూడెం

ప్రగతికి చిరునామా ఫకీరుగూడెం

బొమ్మలరామారం, మార్చి 27: తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తండాలు, గూడెంలను పం చాయతీలుగా ఏర్పాటు చేసిన సందర్భంలో ఫకీరుగూడెం గ్రామం నూతన పంచాయతీగా ఏర్పాటైంది. గతంలో మేడిపల్లి పంచాయతీతో ఐదు వార్డుల ప్రాంతంగా ఉండేది. 2018 ఆగస్టు 2 నుంచి కొత్త పంచాయతీగా ఉనికిలోకి రాగా 2019 ఫిబ్రవరిలో ఎనిమిదిమంది వార్డు సభ్యులతో గణేశ్‌ముదిరాజ్‌ సర్పంచ్‌గా బాధ్యతలు స్వీ కరించారు. ఈ పంచాయతీలో మొత్తం 960 మంది జనాభా ఉండగా, 760 మంది ఓటర్లు, 320 ఇండ్లు ఉన్నాయి. పంచాయతీ ఏర్పాటుతో గ్రామ రూపురేఖలు మారిపోయాయి. ఇంటింటికీ మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలను ఏర్పా టు చేసుకున్నారు. వందశాతం ఇంటి పన్నుల వసూలుతోపాటు వోడీఎఫ్‌ గ్రామంగా ప్రకటించారు. ప్రతి ఇంటికీ మిషన్‌ భగీరథ నీరు అందుతున్నది. రూ. 6.50లక్షలతో మురుగునీటికోసం అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులను పూర్తిచేశారు. గ్రామంలో అన్ని రకాల పింఛన్‌దారులు 175 మంది ఉంటే, అందులో 48మంది గీత కార్మిక పింఛన్‌దారులు ఉన్నారు. ఈ గ్రామం మండలంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికై 2021 జనవరి 26న ప్రభుత్వ విప్‌, ఎంపీ, కలెక్టర్‌ చేతుల మీదుగా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డును సర్పంచ్‌ గణేశ్‌ అందుకున్నారు.
రూ.30లక్షలతో అభివృద్ధి పనులు
14వ ఆర్థిక సంఘం, అలాగే పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా లభించిన రూ.30లక్షలతో గ్రా మంలో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించారు. రూ.20లక్షలతో 800 మీటర్ల సీసీ రోడ్లను నిర్మించారు. పల్లెప్రకృతివనానికి స్థలం లేకపోవడంతో దాత గూనపాటి శ్రీధర్‌ నుంచి 30గుంటల స్థలాన్ని సేకరించి దానిలో 2వేల మొక్కలను నాటి సం రక్షిస్తున్నారు.రూ.12లక్షలతో వైకుంఠధామం, రూ.2లక్షలతో కంపోస్ట్‌ ఎరువుల తయారీ షెడ్డును ఏర్పాటు చేశారు. పాడుబడిన రెండు బావుల ను పూడ్చివేశారు. 20పాత ఇండ్లను కూల్చివేశారు. ఎమ్మెల్సీ నిధులు రూ. 10లక్షలతో బీసీ కమ్యూనిటీ హాల్‌ను నిర్మించారు. నర్సరీలో 10 వేల మొ క్కలను పెంచుతున్నారు. ఉపాధి హామీ పథకం కింద గ్రామంలో 210 మంది జాబ్‌ కార్డులు కలిగి ఉన్న వారికి ఉపాధిని కల్పిస్తున్నారు. చెత్త సేకరణకు ట్రాక్టర్‌ ,ట్రాలీ, మొక్కల సంరక్షణకు ట్యాంకర్‌ను రూ.9.60 లక్షలతో కొనుగోలు చేశారు. దాతల సహకారంతో గ్రామంలో ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయాన్ని పునర్నిర్మించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ధూపదీప నైవేద్యం పథకం కింద నిధులు మంజూరు చేసింది.
అభివృద్ధ్దికి ప్రభుత్వ విప్‌ సహకారం
ఫకీరుగూడెం గ్రామం పక్కనే శామీర్‌పేట్‌ వాగు ఉన్న గ్రామ పరిధిలో ఒక్క చెరువు కూడా లేదు. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు వాగుపై చెక్‌ డ్యాం నిర్మించేందుకు రూ.3కోట్ల్ల55లక్షలను ప్రభుత్వ విప్‌ ,ఆలేరు ఎమ్మెల్యే సునీతామహేందర్‌రెడ్డి మంజూరు చేశారు. పనులు ప్రగతిలో ఉన్నాయి. నాగినేనిపల్లి నుంచి ఫకీరుగూడెం మీదుగా అనంతారం వరకు రోడ్డు నిర్మాణానికి రూ.కోటీ30లక్షలను మంజూరు చేశారు. ఈరోడ్డు పూర్తి అయి తే మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లేం దుకు రవాణా సౌకర్యం మెరుగు పడుతుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రగతికి చిరునామా ఫకీరుగూడెం

ట్రెండింగ్‌

Advertisement