శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - Feb 09, 2021 , 00:07:18

పాతగుట్టకు ఉత్సవ శోభ

పాతగుట్టకు ఉత్సవ శోభ

ఈ నెల 18 నుంచి అధ్యయనోత్సవాలు

22వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు

కొవిడ్‌ నిబంధనల పాటిస్తూ పూజలు 

స్వామివారి కల్యాణ టికెట్ల విక్రయం రద్దు 

వివరాలు వెల్లడించిన ఆలయ ఈవో గీత

యాదాద్రి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం(పాతగుట్ట)కు ఉత్సవ శోభ రానున్నది. కొవిడ్‌ -19 నిబంధనల ప్రకారం 2021 వార్షిక బ్రహ్మోత్సవాలు చేపడుతున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు ఆలయంలో అధ్యయనోత్సవాలు, 22 నుంచి 28 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని  చెప్పారు.  యాదాద్రి కార్యనిర్వాహక కార్యాలయంలో ఆలయ ప్రధానార్చకుడు నల్లందీగల్‌ లక్ష్మీనరసింహచార్యులుతో కలిసి సోమవారం వివరాలు వెల్లడించారు.

- యాదాద్రి, ఫిబ్రవరి 8

 యాదాద్రి, ఫిబ్రవరి 8: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్ని ధిలో సోమవారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని లక్ష పుష్పార్చన పూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వివి ధ రకాల పూలతో పాంచరాత్రగమ శాస్త్రం ప్రకారం సుమారు రెండు గంటలు లక్ష పుష్పార్చన పూజా పర్వాలు కొనసాగాయి. ప్రతి ఏకాదశి స్వయంభూ పంచనారసింహుడు కొలువుదీరిన యా దాద్రిక్షేత్రంలో స్వామిని లక్ష పుష్పాలతో అర్చనలు జరుప డం ఆలయ సంప్రదాయం. ఈ పూజల్లో దేవస్థాన ఉప ప్రధానా ర్చకులు, వేద పండితులు, అర్చక బృంద పర్యవేక్షకులు, సిబ్బం ది, భక్తులు పాల్గొన్నారు. 

యాదాద్రీశుడికి నిత్యారాధనలు

 యాదాద్రీశుడికి నిత్యారాధనలు ఉదయం నాలుగు గంటల నుంచి మొదలయ్యాయి. వేకువజామునే బాలాలయంలో కవ చమూర్తులకు ఆరాధనలు జరిపి, పంచామృతాలతో నిజాభిషే కం నిర్వహించారు. అనంతరం తులసీ అర్చనలు జరిపి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. లక్ష్మీనరసింహుని సుదర్శన నారసింహ మహాయాగంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నా రు. నిత్య కల్యాణోత్సవం జరిపించారు. అనంతరం లక్ష్మీనరసిం హులను అలంకార సేవోత్సవాలతో పాటు అష్టోత్తరంలో భక్తు లు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండ పంలో అష్టోత్తర పూజలు జరిపారు. అమ్మవారికి కుం కుమార్చనలు నిర్వహించారు. సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు పాల్గొని, స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

రామలింగేశ్వరుడికి .. రుద్రాభిషేకం

 యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కొండపై పర్వతవర్దిని సమేత రామలింగేశ్వరస్వామికి సోమవారం మహన్యాస పూర్వ క రుద్రా భిషేకం ఘనంగా నిర్వహించారు. యాదాద్రీశుడిని ద ర్శించుకు నేందుకు వచ్చిన భక్తులు పాల్గొని రుద్రాభిషేకం జరి పించారు. ప్రభాతవేళలో మొదటగా పరమశివున్ని కొలుస్తూ సుమారు గంటన్నర పాటు రుద్రాభిషేకంలో మమేకమయ్యా రు. పరమశివుడికి ఆవుపాలు, పంచామృతాలతో అభిషేకం చేశా రు. విభూతితో అలంకరణ చేశారు. ఆలయంలోని సుబ్రహ్మణ్య స్వామి, మహా గణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహా లకు అభిషేకం చేసి అర్చన చేశారు.

పాతగుట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు

  యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధ ఆల యంగా కొనసాగుతున్న శ్రీపుర్వగిరి లక్ష్మీనరసింహస్వామి దేవ స్థానం(పాతగుట్ట) 2021 వార్షిక బ్రహ్మోత్సవాలను కొవిడ్‌ -19 నిబంధనల ప్రకారం చేపడుతున్నట్లు ఆలయ ఈవో గీత, ఆలయ ప్రధానార్చకుడు నల్లందీగల్‌ లక్ష్మీనరసింహచార్యులు  తెలిపారు. ఈ నెల18 నుంచి 21వ తేదీ వరకు ఆలయంలో అధ్యయనోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. సోమవా రం యాదాద్రి కార్యనిర్వాహక కార్యాలయంలో మీడియాకు వివ రాలు వెల్లడించారు. 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు 2021 వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపనున్నామన్నారు. కొవిడ్‌ నిబంధ నల దృష్ట్యా పాత గుట్ట స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆలయంలోనే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవ కల్యాణ టికెట్ల విక్రయం రద్దు చేస్తూ పరిమితి సంఖ్యలో భక్తులతో స్వా మి వారి కల్యాణం నిర్వహించనున్నట్లు వివరించారు. 

యాదాద్రీశుడి ఆదాయం రూ. 14,51,657 

యాదాద్రీశుడికి నిత్య ఆదాయం రూ.14,51,657 ఆదా యం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ఇం దులో ప్రధాన బుకింగ్‌ ద్వారా రూ.2,47,226, రూ. 100 దర్శనాలతో రూ. 27,100,  రూ.150 దర్శనా ల తో రూ. 83,100, ప్రచారశాఖ ద్వారా రూ. 490, నిత్య కైంకర్యాలతో రూ. 6,117, సుప్రభా తంతో రూ. 900, క్యారీ బ్యాగులతో రూ. 10,600, సత్యనారాయణ వ్ర తాలతో రూ.70,000, కల్యాణకట్టతో రూ. 28, 560, ప్రసాద విక్రయాలతో రూ. 7,22,470, శాశ్వత పూజల తో రూ.7,116, వాహనపూజలతో రూ.13,000, టోల్‌ గేట్‌ ద్వారా రూ.1,280, అన్నదాన విరాళంతో రూ. 20, 446, సువర్ణపుష్పార్చనతో రూ.91,920, యాద రుషి నిలయంతో రూ.63,840, పుష్కరిణితో రూ.400, పాత గుట్ట తో రూ. 16, 860, శివాలయంతో రూ.3,716, ఇతరత్రా రూ.36,516తో కలిపి స్వామికి రూ. 14,51,657 ఆదాయం సమకూరింది. 

 శాస్త్ర ప్రకారమే సింహ ద్వారం తొలగింపు

 యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భా గంగా కొండ కింద గల మెట్ల దారి వెంట గల సింహ ద్వారాన్ని శాస్త్ర ప్రకారమే తొలగించి దేవాలయ అర్చకుల సూచనల మేరకు ద్వారానికి గల విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. కొండచుట్టూ నాలుగు రోడ్ల మా ర్గం నిర్మిస్తునం దున ప్రభుత్వ ఆదేశాల మేరకు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా భవనాలను కూల్చివేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో ద్వారానికి గల ప్రతిమలకు ప్రాణ ప్రతిష్ఠ, నిత్యపూజలు లేనందున,అలాంటి ప్రతిమలు తొలగించేందుకు ఏలాంటి అభ్యంతరం లేదని అర్చకు లు తెలిపారని ఆమె అన్నారు.

పాత గుట్టలో 4రోజులపాటు అధ్యయనోత్సవాలు

తేదీ              ఉదయం                                      సాయంత్రం

18           తిరుమంజనం                                   తొళక్కం

19           తిరుమంజనం                        దివ్య ప్రబంధ సేవాకాలం

20          తిరుమంజనం                         పరమపద ఉత్సవం

21          నూతందారిచాత్మర         

పాతగుట్టలో 2021 వార్షిక బ్రహ్మోత్సవాలు

         తేదీ      ఉదయం                                                                                                        సాయంత్రం/రాత్రి

        22                9 గం॥కు స్వస్తీ వాచనం, రక్షబంధనం                                      5గం॥కు     అంకురార్పణం, మృత్సంగ్రహణం

       23                10 గం॥కు ధ్వజారోహణం, వేదపారాయణాలు                    5 గం॥కు    బేరిపూజ, దేవతాహ్వనం

       24                 6 గం॥కు హవనం, సింహవాహన అలంకార సేవ             7 గం॥కు    స్వామివారి ఎదుర్కోలు(అశ్వవాహనం)

       25                 8 గం॥కు హవనం, తిరుమంజనోత్సవ, 

                                 హనుమంత వాహనం                                    7 గం॥కు    స్వామివారి కల్యాణోత్సవం(గజవాహనం)

      26                  8 గం॥కు గరుడ వాహనం                                                                 5 గం॥కు    రధాంగహోమం, 7 గం॥కు స్వామి రథోత్సవం  

      27                  10 గం॥కుపూర్ణాహుతి, 

                                మ.12గం॥కు చక్రతీర్థ స్నానం                              7 గం॥కుదేవతోద్వాసన, శ్రీపుష్పయాగం, డోలారోహణం

     28                      9 గం॥కు శ్రీస్వామివారి శతఘటాభిషేకం                           మధ్యాహ్నం ఒంటి గంటకు మహదాశీర్వచనం, పండిత సన్మానం

పాతగుట్ట ఆలయ వేళల్లో మార్పులు..

పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ వేళల్లో మార్పులు చేశారు. భక్తుల సౌకర్యార్థం రాత్రి 7. 45 నుంచి 8 గంటల వరకు శయనోత్సవ దర్శనాలకు రూ.25 టికెట్‌ను ఏర్పాటు చేశారు.

ఉ. 5 నుంచి 5.30 గం॥ వరకు           శ్రీ స్వామివారి సుప్రభాతం

ఉ. 5.30- 6.15 గం॥ వరకు              శ్రీ స్వామివారి ఆరాధన

ఉ. 6.15 - 6.45 గం॥ వరకు             శ్రీ స్వామివారి బాలభోగం

ఉ. 6.45 - 8.00 గం॥ వరకు            ఉభయ దర్శనాలు

ఉ. 8.00 - 8.30 గం॥ వరకు            శ్రీస్వామివారి అభిషేకం

ఉ. 8.30 - 9.00 గం॥ వరకు            శ్రీస్వామివారి సహస్రనామార్చన

ఉ. 9 - 10గం॥ వరకు                              శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలు

ఉ. 10.30 - 11.30 గం॥ వరకు      శ్రీస్వామివారి కల్యాణం  

ఉ. 9  - 11.30 గం॥ వరకు                   ఉభయ దర్శనాలు

ఉ. 11.30 -12 గం॥ వరకు                  మధ్యాహ్న రాజభోగం, ఆరగింపు

మ. 12 నుంచి 1 గం॥ వరకు                 శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలు

మ. 12- 2 గం॥ వరకు                             ఉభయ దర్శనాలు

మ. 2 - 3 గం॥ వరకు                                ద్వార బంధనం

మ. 3- 4 గం॥ వరకు                                 ప్రత్యేక దర్శనాలు

మ. 4- 5 గం॥ వరకు                                 శ్రీసత్యనారాయణ స్వామి వత్రాలు

సా. 4- 7 గం॥ వరకు                                 ఉభయ దర్శనాలు

రాత్రి 7- 7.45 గం॥ వరకు                     ఆరాధన, ఆరగింపు

రాత్రి 7.45 - 8 గం॥ వరకు                    శయనత్సోవ దర్శనం

రాత్రి 8 గంటలకు                                           ద్వార బంధనం

స్వామివారికి లక్ష పుష్పార్చన

VIDEOS

logo