ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Jan 04, 2021 , 02:08:31

మహిళా విభాగానికి సావిత్రిబాయి కృషి

మహిళా విభాగానికి సావిత్రిబాయి కృషి

  • మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ చింతల కిష్టయ్య 
  • ఘనంగా జయంతి  

భువనగిరి, జనవరి3: అణగారిన వర్గాల హక్కుల కోసం ఉద్యమించిన గొప్ప సంఘసంస్కర్త సావిత్రిబాయి ఫూలే అని మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ చింతల కిష్టయ్య అన్నారు. ఆదివారం పట్టణ పరిధిలోని రాయగిరిలో సావిత్రిబాయి ఫూలే జయంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ సామాజిక ఉద్యమాల్లో భర్త మహాత్మా జ్యోతిబాఫూలే అడుగుజాడల్లో నడుస్తూ మహిళా వికాసానికి ఎంతగానో కృషి చేశారని అన్నారు. కార్యక్రమంలో ముల్లె నాగేంద్రబాబు, పోల ప్రవీణ్‌కుమార్‌గౌడ్‌, గడ్డం సతీశ్‌, కొండం ఉపేందర్‌గౌడ్‌, అవుశెట్టి పాండుయాదవ్‌, బొజ్జ నవీన్‌, ఎర్రబోతు అనిల్‌, రామాంజనేయులు, నర్సింగ్‌రావు, శివ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

భువనగిరిలో..

భువనగిరి అర్బన్‌, జనవరి 3: సావిత్రిబాయి ఫూలే జయంతిని పట్టణంలోని జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్ర హం వద్ద ఏర్పాటు చేసిన సాయిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేశారు. అదే విధంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో వినాయకచౌరస్తాలో సావిత్రిబాయి ఫూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త నర్సింహస్వామి, మాజీ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ సుర్వి లావణ్యాశ్రీనివాస్‌గౌడ్‌, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు కోనేటి గోపాల్‌, కాంగ్రెస్‌ నాయకులు రవికుమార్‌, నజియసలావుద్దీన్‌,  వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. 

బీబీనగర్‌లో..

బీబీనగర్‌, జనవరి 3: సావిత్రిబాయి ఫూలే జయంతిని ఆది వారం వివిధ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వ హించారు. కొండమడుగు వద్ద నిర్వహించిన జయంతిలో యువతెలంగాణ పార్టీ వ్యవస్థాపకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాణీరుద్రమ పాల్గొన్న సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు లక్ష్మీనారాయణ, శంకర్‌, భాస్కర్‌గౌడ్‌, సాయిలు, ప్రవీణ్‌రెడ్డి, రవి, జంగయ్య, సంతోశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వలిగొండలో..

వలిగొండ, జనవరి 3: సంఘ సంస్కర్త సావిత్రి బాయి ఫూలే జయంతిని మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయం ఆవర ణలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి ఎస్సై రాఘవేందర్‌గౌడ్‌  పూలమాల వేసి  నివాళులర్పించారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్‌ పల్లేర్ల ప్రకాశ్‌, బీసీ సంఘం మండల అధ్యక్షుడు సాయిని యాదగిరి, రాపోలు పవన్‌కుమార్‌, కందుల ఆంజనేయులు, ఎడవెళ్లి శాంతికుమార్‌, ఎమ్మె లింగస్వామి, కాసుల వెంకన్న, బత్తిని రాఘవేందర్‌, ఉదయ్‌, భిక్షపతి, పిట్టల ఆంజనేయులు, మన్నెం కవిత తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo